బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో నాలుగురోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, మంత్రులు అధికారులతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సంధర్బంగా పలు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల మొబైల్ ఫోన్స్ కు మెసేజ్ లు పంపి అప్రమత్తం చేయాలని సూచించారు. వాగులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు.