ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె, రాయ్‌గఢ్, పుణె ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.