- బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,వాక్సన్ యూనివర్సిటీ,
ఏఎంఆర్ ఇండియా సంస్థ - సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేత
వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 01 కోటి రూపాయల విరాళం అందించింది.కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి,ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు.సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.05 కోట్ల విరాళన్ని అందజేసిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ :
వరద బాధితులను ఆదుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముందుకొచ్చింది.వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.05 కోట్ల రూపాయల విరాళం అందించింది.రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణ రెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిను కలిసి విరాళం చెక్కును అందజేశారు.సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డీస్ ల్యాబ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస రెడ్డి,ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు.
వాక్సన్ యూనివర్సిటీ
వరద బాధితుల సహాయార్థం వాక్సన్ యూనివర్సిటీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించింది.యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ కె.పూల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు.వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ,విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.
ఏఎంఆర్ ఇండియా సంస్థ
వరద బాధితులను ఆదుకునేందుకు ఏఎంఆర్ ఇండియా సంస్థ విరాళం అందించింది.సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.01కోటి రూపాయలు విరాళం అందించింది.కంపెనీ ఎండీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.