Wednesday, January 22, 2025
spot_img

నంద‌కుమార్ వ్య‌వ‌హారంలో ప‌రువు పోగొట్ఠుకున్న ద‌గ్గుపాటి ఫ్యామిలీ

Must Read
  • దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్‌, రాణాలకు సంక్రాంతికి సురుకు పెట్టిన నాంపల్లి కోర్ట్‌
  • నందకుమార్‌కు సంబంధించిన కోట్ల విలువైన ఆస్థి ధ్వంసం..
  • ప్రైవేటు ఆస్థిని ప్రభుత్వ నిధులతో కూల్చివేసిన దుర్మార్గం..
  • మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు దగ్గరుండి కూల్చడంతో మతలబేంటి..
  • కూల్చివేసిన అధికారులపై కేసు నమోదు కానుందా..?
  • ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్‌ ఉన్నాడా..?
  • నందకుమార్‌కు జరిగిన నష్టంలో సంబంధిత అధికారులు సూత్రధారులేనా?
  • గత ప్రభుత్వంలో అధికారులు చేసిన అక్రమంపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది..?
  • చీఫ్‌ సెక్రటరీ శాంతి కుమారి స్పందించి బాధ్యులైన అధికారులను విధుల నుండి తొలగించాలని వస్తున్న డిమాండ్స్‌

ఆయన టాలీవూడ్ లో సీనియర్ హీరో.. ఈ సంక్రాంతికి విడుదలైన తన చిత్రంతో వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నాడు.. దాదాపు వందకోట్ల క్లబ్ లో ఆయన తాజా చిత్రం చేరిపోయింది.. ఆయనే దగ్గుబాటి వెంకటేష్.. సినిమా వసూళ్ల సంగతి అటుంచితే.. నిజజీవితంలో అక్రమ ఆస్థులను కూడగట్టుకోవడానికి ఈ హీరో సాహసించడం సంచలనంగా మారింది.. తన చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన.. విలన్లను తరిమి తరిమి కొడతాడు.. మరి ఈయనే నిజజీవితంలో విలన్ గా మారిపోయాడు.. ఈయనకు తోడు ఈయన అన్నకొడుకు మరో హీరో రానా.. వీళ్లకు వెన్ను దన్నుగా దగ్గుబాటి సురేష్.. ఇంకేముంది ఓ అమాయకుడిని టార్గెట్ చేసి, కోట్ల విలువచేసే ఆస్థిని కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశారు.. పథకం కూడా అమలు చేశారు.. ఈ ప్రసహనంలో అధికారులు, నాయకులు, ఒక మంత్రి వర్యులు సహకరించినట్లు తెలుస్తోంది.. గత ప్రభుత్వంలో వీరు చేసిన నిర్వాకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది..

హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఫామ్ హౌస్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే.. ఈ కేసులో ఉన్న నందకుమార్ ను గత ప్రభుత్వంలో జైలుకు పంపిన సమయంలో.. ఫిలింనగర్ పరిధిలో ఉన్న నందకుమార్ కు సంబంధించిన “దక్కన్ కిచెన్ హోటల్ (Deccan Kitchen Hotel)” కూల్చివేత వ్యవహారం సైతం నాడు హాట్ టాపిక్ గా మారింది.. జైలు నుండి బయటకు వచ్చిన నందకుమార్ సుమారు 20 కోట్ల పైచిలుకు విలువచేసే తన ఆస్థిని అడ్డగోలుగా ధ్వంసం చేసి భారీ నష్టాన్ని కలిగించారని నందకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాడు నందకుమార్.. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు హీరో వెంకటేష్, రాణా, సురేష్ బాబు, అభిరాంలపై కేసు నమోదు చేయాలని ఫిలింనగర్ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో దగ్గుపాటి ఫ్యామిలీపై కేసు నమోదు అయింది.. సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ కేసు వ్యవహారం..

అయితే తీగలాగితే డొంక కదిలినట్టు నందకుమార్ కు చెందిన హోటల్ కూల్చివేత విషయంలో అధికారులు చేసిన అక్రమాలు బట్ట బయలయ్యాయి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న లోకేష్ కుమార్ తో పాటు, కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం చూపించారా..? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఫిలింనగర్ లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ స్థలం ముమ్మాటికి ప్రైవేటు స్థలం.. ఇట్టి స్థలాన్ని లీజుకు తీసుకొని చట్టబద్ధంగా హోటల్ నిర్మాణం చేసుకొని తన యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు నందకుమార్.. ఫామ్ హౌస్ కేస్ తెరపైకి రాగానే నందకుమార్ కు సంబంధించిన హోటల్ ను హీరో వెంకటేష్, రాణా, సురేష్ బాబులు నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో దగ్గరుండి ఆ హోటల్ ను యథేచ్ఛగా కూల్చివేయడంతో నందకుమార్ కు అపార నష్టం జరిగిందన్నది నిర్విదాంశం.. కాగా తనకు జరిగిన అన్యాయంపై గత ప్రభుత్వంలో ఫిర్యాదులు చేస్తే అధికారులు పట్టించుకోకపోవడం ఒక ఎత్తైతే.. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ అధికారులు విధినిర్వహణలో ఉన్న మున్సిపల్, పోలీస్ అధికారులు దగ్గరుండి హోటల్ ని కూల్చివేయడం ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదనేది సామాన్యుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ..

మున్సిపల్ చట్ట నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారు అధికారులు అనేది చట్టం.. నందకుమార్ కు సంబంధించిన హోటల్ పూర్తిగా ధ్వంసాన్ని చేయుటకు అధికారులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్టే అవుతుంది కదా..?సెలవు దినం లో ప్రభుత్వ జేసిబి వాహనాలు అందుబాటులో లేకున్నా సెలవు దినంలో ఏదో కొంపలు అంటుకపోతున్నాయన్నట్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది..రాష్ట్ర హైకోర్టు కూల్చద్దని చెప్పిన.. యదేచ్చగా చట్టాలను బేఖాతరు చేసి కూల్చడం చట్టాలను వీరు పాటించరు అనేది అట్టే అర్థమైపోతుంది.. అలాంటప్పుడు బాధ్యులైన అధికారులను ఎందుకు విధులనుండి ఈ ప్రభుత్వం నేటికీ తొలగించడం లేదని నందకుమార్ డిమాండ్ చేస్తున్నాడు..గతేడాది జరిగిన ఈ సంఘటనలో అప్పటి జీ.హెచ్.ఎం.సి. కమిషనర్, మిగతా అధికారులు.. అలాగే పోలీస్ సిబ్బందికి బాధ్యత లేదా..? ఒక ప్రైవేట్ ప్రాపెర్టీని ప్రభుత్వ సొమ్ముతో ఎలా కూల్చివేస్తారు..? మీకు ఆ అధికారం ఎవరిచ్చారు.. అయితే ఈ వ్యవహారంలో దగ్గుబాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న నాటి మున్సిపల్ శాఖ మంత్రి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం ఆరోపించాడు నందకుమార్ ..ఇదే విషయం పై అధికారులు సమగ్ర విచారణ జరిపితే తెర వెనుక ఉన్న మంత్రి కేటీఆర్ అని ఈ కార్ ఫార్ములా రేసు కేసు లో అరవింద్ కుమార్ కు చెప్పి నిధులు ఎలా దారి మళ్ళించారో.. అదే తరహా లో ఫామ్ కేసులో ఉన్న నంద కుమార్ హోటల్ ను సైతం కూల్చి వేయుటకు నాటి మున్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్ కు అదేశాలు కేటీఆర్ ఇచ్చాడని అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై మరిన్ని నిజా నిజాలను వాస్తవాలు ఆధారంగా మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

YouTube player
Latest News

మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్

మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS