రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.ఆదివారం ఉదయం మిథున్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారం కోల్పోయింది.దింతో పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి.వైసీపీ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీ మారారు.మరోవైపు పుంగనూరులో పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది.వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది కౌన్సలర్లు టిడిపిలో చేరారు.మున్సిపల్ చైర్మన్ అలీమ్ భాషా కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు.తాజాగా పుంగనూరులో జరుగుతున్నా రాజకీయ పరిణామాల పై పార్టీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయాలనీ భావించారు.టీడీపీ పార్టీకి చెందిన నాయకులు ఈ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ముందస్తు సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పుంగనూరు వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు జరగకుండా ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు మిథున్ రెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.పోలీసుల తీరు పై మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీగా సొంత నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టిన కార్యకర్తల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.