- దక్షిణాదిలో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ ను రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి..
- విపక్ష టీడీపి కూటమి ఈ ఎన్నికలలో సునామీ సృష్టించింది..
- టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం లో అధికార వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది…కేవలం పది సీట్లకే పరిమితమయింది.
- టీడీపీ కూటమి మొత్తం 165 సీట్లలో సత్తా చాటి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది..
- తెలంగాణతో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇవి మూడో ఎన్నికలు..
- 2014 లో తొలి ఎన్నికలలో టీడీపీ సాధారణ మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..
2019 లో జరిగిన రెండవ ఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.. మొత్తం 151 సీట్లు గెలుచుకుని తిరుగులేని పార్టీగా నిలిచింది..
అయితే కేవలం ఐదేళ్లలోనే వైఎస్ఆర్సీపీ పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు కనిపిస్తోంది… తాజా గా జరిగిన ఎన్నికలలో ప్రజల వ్యతిరేకతతో వైఎస్ఆర్సీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.. జగన్ పాలనపై తీవ్రంగా విసిగిపోయిన ప్రజలు ఆయనకు అండగా నిలుస్తుందని భావించిన రాయలసీమ లో కూడా తిరస్కరించారు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నీ ప్రజలు తిరస్కరించారు.