Sunday, November 24, 2024
spot_img

బోజ్జ గణపయ్యకు హైటెక్‌ బందోబస్తు

Must Read
  • ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ పరిజ్ధానంతో పోలీస్ సిబ్బందికి విధుల కేటాయింపు
  • గణేష్‌ నిమజ్జన యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లు తూది దశకు చేరుకున్నాయి-నగర సీపీ సీవీ ఆనంద్
  • పాతబస్తీకి అదనపు బలగాలు చేరుకున్నాయి – దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా

హైదరాబాద్‌ నగరంలో గణేష్‌ ఉత్సవాల సందర్భంగా నగర పోలీస్ విభాగం అధునాతన భద్రత వ్యవస్థను ప్రవేశపెట్టింది.నగరంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.రాష్ట్రంలో జరిగిన బోనాలు,శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగించారు.ఈ సాఫ్ట్ వేర్ పై సానుకూల స్పందన రావడంతో జంటనగరాల్లో కమిషనరేట్‌ పరిధిలో ఈ సాఫ్ట్ వేర్ ను వినియోగిస్తున్నారు.మరోవైపు వినాయక చవితి సంధర్బంగా ప్రతి ఏటా 12వేలా మంది అదనపు సిబ్బంది బందోబస్తులో పాల్గొనే వారు.కానీ
ఈ సంఖ్యను ఇప్పుడు రెట్టింపు చేసి అధిక బలగాలను రప్పిస్తున్నారు.అవసరం ఉన్న చోట్ల కేంద్ర బలగాలు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సేవలను వినియోగించుకోవడానికి సన్నహాలు చేస్తున్నారు.స్థానిక పోలీస్ అధికారులు అదనపు బలగాల విధుల కేటాయింపులో ఉంటే,మిగత సిబ్బంది మండపాల్లో బందోబస్తు ఆంశాలను నిర్వహాకులతో కలిసి సమన్యయం చేసుకుంటున్నారు.వీటన్నిటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపోందించి భద్రతను పటిష్టం చేస్తున్నారు.సాంకేతిక ఆంశాలను నిపుణుల పర్యవేక్షణలో చూసుకుంటున్నారు.వీటితో పాటు డ్యూటీ కేటాయింపులను కూడా సాఫ్ట్‌వేర్‌ ద్వారానే చేస్తున్నారు.గణేష్‌ పండగ ఉత్సవాల సందర్భంగా పోలీసు ఠాణాల కేటాయింపులు జరుగుతున్నాయి.

హైటెక్‌ బందోబస్తు,సాంకేతిక పరిజ్ఞానం…!!

గణేష్‌ ఉత్సవాల సందర్భంగా విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ పోలీసు కమిషనరెట్‌లో 10వేల మంది సిబ్బంది ఉన్నారు.వీరితో పాటు ఇతర జిల్లాల నుండి అదనపు సిబ్బంది వస్తున్నారు.వీరు ఎక్కడ,ఎలాంటి విధులు నిర్వహించాలన్నది గత ఏడాది ఆయా జోన్ల డీసీపీలు నిర్ణయించుకుని అదనపు బలగాలను కేటాయించేవారు.అదనపు బలగాలన్నీ ఒకేచోటా రాకపోవడంతో తరుచూ ఇబ్బందులు ఎదురయ్యేది.ఇందుకు విరుగుడుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ను పోలీస్‌శాఖ ఏర్పాటుచేసింది.ఇందులో నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ ఠాణాలు వినాయక మండపాల వివరాలను అనుసందించారు.ప్రతి మండపం వద్ద ఎంత మంది బందోబస్తు కావాలన్నది సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేశారు.జోన్లవారిగా ప్రతి ఠాణా పరిధిలో ఇన్‌స్పెక్టర్‌, ఆ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలోని మండపాల జాబితా సున్నీత సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించారు.ప్రతి మండపం వద్ద ఫలానా ఎస్సై లేదా కానిస్టేబుల్‌ ఉంటారని,వారి పేరు,ఫోన్‌ నెంబర్‌ పొందుపరిచారు.నగరం మొత్తం ఒకే డేటాను రూపోందించారు.అదనపు బలాగాలు వచ్చిన వెంటనే ఠాణాల పరిధిలోని కంప్యూటర్‌లో వారి వివరాలను నమోదుచేస్తారు.బందోబస్తు విధులు నిర్వహించే వారిని జోన్లవారిగా వర్గీకరించి ఫలానా చోట విధులు నిర్వహించాలన్నది ఈ సాఫ్ట్‎వేర్ ద్వారానే నిర్ణయించబడుతుంది.నగర పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ వరకూ వేర్వేరు పాస్‌వర్డ్‌ ల ద్వారా ప్రతి ఠాణా పరిధిలో ఎక్కడ,ఎవరు విధులు నిర్వహిస్తున్నారో కంప్యూటర్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

నగర సీపీ సీ.వీ ఆనంద్‌ మాట్లాడుతూ,

నగరంలో గణేష్‌ నిమజ్జన యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రత ఏర్పాట్లు తూది దశకు చేరుకున్నాయని తెలిపారు.శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.సున్నీతమైన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు.మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.నిర్వహాకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు.పాతబస్తీపై ప్రత్యేక దృష్టీపెట్టమని పేర్కోన్నారు.

దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ,

దక్షీణ మండల పరిధిలో ఉన్న గణేష్‌ మండపాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.రాత్రి,పగలు మండపాల వద్ద తనిఖీలు చేస్తున్నామని,డ్యూటీ బుక్‌లో
తనిఖి వివరాలు నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు.నిఘా కేమెరాలు ఏర్పాటు చేసి జీయో ట్యాగ్‌ చేశామని పేర్కొన్నారు.పోలీసుల అనుమతి తీసుకున్న గణేష్ మండపాల సంఖ్య దాదాపు 1455 వరకు ఉన్నాయని అన్నారు.గణేష్‌ మండపాల వివరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కంప్యూటర్‌లో నమోదై ఉన్నాయని వాటి ఆధారంగా ఇన్స్‌స్పెక్టర్‌ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటారని తెలిపారు.గణేష్‌ నిమజ్జన యాత్ర సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.ఇప్పటికే అదనపు బలగాలు పాతబస్తీకి వచ్చాయని,వీటితోపాటు కేంద్ర బలగాలు కూడా వస్తాయని తెలిపారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS