Thursday, September 19, 2024
spot_img

భారీ మోసం,రూ.700 కోట్లతో బోర్డు తిప్పేసిన సంస్థ

Must Read

రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు లక్షల్లో కాజేస్తున్నారు.ఫెక్ సంస్థలను నెలకొల్పి చివరికి బోర్డు తిప్పేస్తున్నారు.పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాధితులు మాత్రం కేటుగాళ్ల ఉచ్చుల్లో చిక్కుతూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి మొహం చాటేసింది ఓ సంస్థ.లక్షల్లో కాదు ఏకంగా రూ.700 కోట్ల రూపాయలు కాజేసి బోర్డు తిప్పేసింది.అదే dkz సంస్థ.తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని భారీగా పెట్టుబడులు సేకరించింది.ఇన్వెస్టర్లను నమ్మించెందుకు మొదట లాభాలు చూపెట్టింది.ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు వారి ఖాతాల్లో డబ్బులు కూడా జమయ్యాయి.తీర రూ.700 కోట్లతో బోర్డు తిప్పేసింది.మూడు రాష్ట్రాల్లో 55 వేల మంది బాధితులు ఈ సంస్థ ఉచ్చుల్లో చిక్కుకున్నారు.కేవలం హైదరాబాద్ నగరంలోనే 18 వేల మంది ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి నష్టపోయారు.చివరికి తమ గోడు ఎవరికి చెప్పుకోవలో అర్థం కాక సోమజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను వ్యక్తం చేసుకున్నారు.తాము నష్టపోయామని గ్రహించి కొంతమంది బాధితులు బషీర్‎బాగ్ లోని సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This