మన నేటి సమాజంలో రోజులు గడిచేకొద్దీ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా మనుషులు మారుతు జీవితాలను గడిపేస్తున్నారు.కానీ ఇందులో గమనించాల్సిన విషయం మార్పు అనేది మానవ సంబంధాలపై మరియు వ్యక్తిగత జీవితాలపై ఏమేర ఫ్రభావం చూపుతుంది అనేది చాలా ముఖ్యం.నేటి ప్రస్తుత కాలంలో ప్రతి ఒకరిపై అతి తీవ్రంగా ప్రభావం చూపుతున్నా వాటిలో ప్రధానమైనది ఇంటర్నేట్.ఈ ఇంటర్ నెట్ అనేది అనేక విధాలుగా ఫేస్బుక్,వాట్సాప్,ఇన్ స్టా గ్రామ్ ఇలా వివిధ రూపాల్లో మన ముందు ఉంది.దీనినే సోషల్ మీడియా అని గొప్పగా పిలుస్తారు.నేటి ప్రస్తుత కాలంలో ఇంటర్ నెట్ మోసాలకు బలి అవుతున్నా అమాయకులు ఉన్నారు. మరియు మరికొందరు దానిని ఆసరాగా చేసుకుని వింత కోరికలతో కుటుంబ విలువలను తుంగలో తొక్కి ఊహకందని ఊహల లోకంలో విహరిస్తున్నా వారు ఉన్నారు.సోషల్ మీడియాకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోగా, మానవ సంబంధాలను మంటకలుపుతున్నా సంఘటనాలు మనం చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా కొన్ని సంఘటనలు చూస్తే సభ్యసమాజం తల దించుకునే పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు యువతిపై ప్రభావం చూపిన అంతర్జాలం నేడు హద్దులు దాటి కుటుంబం,పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఉన్న ఆడవాళ్లను సైతం ప్రభావితం చేసింది.ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనాలు నివ్వెరపోయెలా ఉన్నాయి. ఫేస్బుక్ లో అపరిచిత వ్యక్తులతో పరిచయం వివాహేతర సంబంధంగా మారి కట్టుకున్నా భర్తలను చంపడం మరియు పరిచయం అయిన వ్యక్తితో అవసరాలను తీర్చుకున్నాక అదే వ్యక్తిని మట్టు పెట్టడం అనేది సమాజం తీరు దారి తప్పేదాని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.వివాహం అయినా తరువాత భర్త అనే వాడు సంపాదన, ఉద్యోగం, కుటుంబ భారం, ఖర్చులు, పిల్లలు ఇలా ఎన్నో బాధ్యతలతో సతమతవుతుంటాడు.కానీ తనతో జీవితం పంచుకోవడానికి వచ్చి అన్ని తనే చెప్పి చివరికి కడతెర్చే పరిస్థితికి కారణాలు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం.ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవాళ్లు కూడా నేటి కాలంలో సోషల్ మీడియా వినియోగంలో ముందున్నారు.సోషల్ మీడియా కానీ ఇంటర్ నెట్ కానీ వినియోగించడం తప్పు అని ఎవరూ అనట్లేదు. కాకపోతే దానిని వినియోగించే తీరు మారాలి. అందుబాటులో ఉందికదా అని హద్దుల దాటి మానవతా విలువలను పాతరేస్తూ ఎంతో గొప్ప జీవితాలను నాశనం చేసుకోకుండా చూసుకోవాలి.కుటుంబం, పిల్లలు, బాధ్యతలు,సమాజం, ఇలా ఎన్నో హద్దులు ఉన్న వాటిని దాటుకుని వివాహిత స్త్రీల ఆగడాల సంఘటనలు ఒకరకంగా భయాన్ని తలపించేలా ఉన్నాయి అనడంలో సందేహాం లేదు.కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత, అన్యోన్యత ఉండేలా చూసుకోవాలి.వీలైనంత ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేలా చూసుకోవాలి.ఏది ఏమి అయినా మానవ సమాజంలో బ్రతుకుతున్నామనే ఆలోచనను మరిచిపోకూడాదు.మనిషిగా మన దగ్గర ప్రేమ, అనురాగం,ఆపాయ్యత, అనే గొప్ప విలువలతో పాటు ఉన్నతమైన చదువు సంస్కారం ఉన్నాయి.కానీ నేడు అలాంటి వాళ్లలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా వింత కోరికలతో కుటుంబాలను నాశనం చేసుకోవడం బాధాకరం. సాంకేతికత, విజ్ఞానం రోజులు మారే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది.అది కేవలం మనం జీవితంలో ఉన్నత స్థాయి చేరడానికి తప్ప మనిషి మూలాలను మరిచి వికృత చెష్టలతో కాలం వృథా చేయడానికి కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
వంశీకృష్ణ గౌడ్.బండి
రంగయ్యపల్లి,రేగొండ
జయశంకర్ జిల్లా