హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. సహనం కోల్పోయిన భర్త తన భార్యను గొంతు కోసి హతమార్చాడు. ఈ సంఘటన బండ్లగుడా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బండ్లగుడాకు చెందిన ఖురేషీ (24) పిసల్ బండాకి చెందిన ఖమర్ బేగంని ఆరేళ్ళ క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వీరి మధ్య చిన్న గొడవ జరిగింది. సహనం కోల్పోయిన ఖురేషీ ఖమర్ బేగంని గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మంటల్లో కాల్చేసి, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.