- కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని చదవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ రాజ్యాంగం చదవలేదు..దీనికి గ్యారంటీ ఇవ్వగలనని అన్నారు. రాజ్యాంగంతోనే సామాజిక సాధికారత లభిస్తుందని పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాలని రాజ్యాంగం చెప్పలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన ప్రారంభమైందని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కులగణన ద్వారా ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కుతోందని అన్నారు.