- తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత అందె శ్రీదే : సీఎం రేవంత్ రెడ్డి
– ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది అందెశ్రీ ఇష్టం
– కీరవాణి వ్యవహారంతో నాకు ఎలాంటి సంభందం లేదు
- ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఫోన్ ట్యాపింగ్ పై సమీక్షా చేయలేదు
– ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు ఎందుకు సీబీఐ విచారణ అడగడంలేదు - ప్రతిపక్షాల ఆరోపణలు లేకుండా , స్వేచ్ఛమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాము
– తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యత అందె శ్రీకి ఇచ్చామని అయిన ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది అందెశ్రీ ఇష్టమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ అంటే త్యాగాలు , పోరాటాలు , చిహ్నాలని అందుకే తెలంగాణ తల్లి , గీతం స్ఫురించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని స్వష్టం చేశారు.ఎ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తనపని కాదని, రాష్ట్ర గేయ రూపకల్పన బాధ్యత అంతా అందె శ్రీదేనని తెలిపారు.తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాదు వ్యక్తికి ఇచ్చామని, కీరవాణి వ్యవహారంతో తనకు ఎలాంటి సంభంధం లేదని తేల్చిచెప్పారు.మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక్క ఇరిగిందని తాను ముందే చెప్పానంటూ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పైన సమీక్షా జరపలేదని,అది అధికారులు చూసుకుంటారని వెల్లడించారు.అన్నిటి పై సిబిఐ విచారణ అడిగే కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు తాను చేయనని ముఖ్యమంత్రి రేవంతే రెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కోట సమస్యలు లేవని వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో అధికారుల ట్రాన్స్ఫర్ లు జరిగాయని తెలంగాణాలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని గుర్తుచేశారు.ప్రతిపక్షాల ఆరోపణలు లేకుండా స్వేచ్ఛమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించామని వెల్లడించారు.ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి హాజరుకావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి ఆహ్వానం పంపించారు.