Wednesday, March 12, 2025
spot_img

ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు వస్తే నిలదీయండి

Must Read
  • కేటీఆర్, హరీష్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు
  • మార్చి 31 లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తాం
  • ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి లోగా స్వయం ఉపాధి పథకాలకు 6,000 కోట్లు
  • తెలంగాణ రైజింగ్ ను కెసిఆర్ కుటుంబం అడ్డుకోలేదు
  • వనపర్తి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ ప్రజా సమస్యలను పరిష్కరించలేని సన్యాసి అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) మండిపడ్డారు. వనపర్తి లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం జరిగిన ప్రజాపాలన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గడిని దాటి బయటికి రాలేని కెసిఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ లు తమ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రిని, మంత్రులను పాలన చేతకాని సన్నాసులు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్లు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించటం మానుకోవాలని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బిఆర్ఎస్ నేతలను గ్రామాలకు వస్తే ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ఆనాడు మీ పాలనలో ఎందుకు చేయలేదని బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించాలని ప్రజలను కోరారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను సాగిస్తుందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. గడి నుంచి ఏనాడు బయటికి రాని పెద్దమనిషి తో పాటు కేటీఆర్ హరీష్ లు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. పదేళ్లపాటు దోచుకోవడానికి అలవాటు పడిన బిఆర్ఎస్ నేతలు, తాము అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పదేళ్లు పాలించిన మీరు దళితులకు మూడు ఎకరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు, లక్ష రూపాయల రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు.

మార్చి 31 లోగా రైతు భరోసా జమ.
గత బిఆర్ఎస్ పాలకులు రైతు బంధు పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అప్పటి ప్రభుత్వం ఒక సీజన్లో రైతుబంధు ఎగవేసిన తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,660 కోట్ల రైతుబంధును జమ చేసిందన్నారు. అప్పటి ప్రభుత్వం సీజన్ కు ఎకరాకు 5,000 ఇస్తే తమ ప్రభుత్వం ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి రెండు పంటలకు అదనంగా 2,000 కలిపి 12,000 చెల్లిస్తుంది అని తెలిపారు. ఇప్పటికే రెండో విడత రైతు భరోసాను ప్రారంభించామని 9,660 కోట్ల రైతు భరోసా నిధులను మార్చి 31 లోగా జమ చేస్తామని తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న ఆ సన్యాసి మాట తప్పడమే కాకుండా దళితులను మోసం చేశారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. గృహ జ్యోతి కింద గ్యాస్ సిలిండర్ రూ .5,00 లకె ఇస్తున్నామని ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖకు రూ. 4,440 కోట్లను ఇప్పటికే చెల్లించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలు ఉంటాయని బి ఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేశారని, గత 15 సంవత్సరాలలో ఎప్పుడూ లేనివిధంగా ప్రస్తుతం 16 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నప్పటికీ రెప్పపాటు కూడా కరెంటు సరఫరాలో ఒక్క క్షణం ట్రిప్ కాకుండా నాణ్యమైన విద్యుత్ ని ఇస్తున్నామన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం 14,870 కోట్ల ను డిస్కంకు రైతుల పక్షాన ప్రభుత్వం డబ్బులు చెల్లించిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజల కోసం 200 యూనిట్లను ఉచితంగా ఇస్తున్నామని, ఇందుకుగాను ప్రభుత్వం డిస్కంకు 1,689 కోట్లను చెల్లించిందన్నారు. రైతులు వేసిన పంటలు పకృతి వైపరీత్యాలతో దెబ్బతింటే రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ రైతుల తరఫున 1,514 కోట్లు కట్టామన్నారు. సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ చొప్పున చెల్లిస్తున్నామని, ఇందుకు గాను 1,804 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. గత 10 ఏళ్ల బి ఆర్ఎస్ పాలనలో రెసిడెన్షియల్ స్కూల్ లకు కాస్మెటిక్స్ డైట్ చార్జీలను ఒక్క రూపాయి ఇవ్వలేదని, తమ ప్రభుత్వం పెద్ద మనసుతో 40 శాతం పెంచిందన్నారు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న సన్నాసులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించి ఏ ఒక్క భవనం నిర్మించలేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 60 ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసి ఒక్కొక్క స్కూల్కు రూ. 2,00 కోట్లను మంజూరు చేసి నిర్మించడం జరుగుతుందని, ఇది తమ ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నిత్యం 18 గంటల పాటు పనిచేసి సంపాదించిన ప్రతి పైసాను ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు చేస్తుందన్నారు

వనపర్తి నుంచే కొత్త పథకం ప్రారంభం…
వనపర్తి నియోజకవర్గం అత్యంత రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతమని, ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభిస్తుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు పాలన చేసి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వాలు అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేసిందని, కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించేది అని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాత్రం నాటి ప్రభుత్వం కార్పొరేషన్ లకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు తర్వాత తమ కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు 6,000 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గ్రూపులకు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల లోగా 6,000 కోట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2,200 జరిగిందన్నారు.విద్యార్థి దశ నుంచి ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టారు అన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులు మైనార్టీ బీసీల గురించి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించ లేదన్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల భారం వేసినప్పటికిని, తమ ప్రభుత్వం ఏమాత్రం అధైర్య పడకుండా కార్యక్రమాలను కొనసాగిస్తుందని, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు లిఖించదగిందన్నారు రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడం జరిగిందని, ఇందుకుగాను 22,000 కోట్లను మూడు నెలల్లో వేసిన చరిత్ర తమ ప్రభుత్వాన్ని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ల పేరిట ప్రజలను మోసం చేసిందని , తమ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 7 వేలఇళ్లను మంజూరు చేసి, మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇండ్లను నిర్మించడం కోసం ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం దావూస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,80,000 కోట్ల అగ్రిమెంట్లను చేసుకుని వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఎన్ని కుట్రలు చేసినా ఏ మాత్రం అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS