రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు.ఉక్రెయిన్ తో సంధికి తాము సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు.అయితే కొన్ని షరతులు విధిస్తూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రష్యా సైనికులు ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రేయిన్ వదులుకోవాలని,నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తాము డిమాండ్ చేసిన ఈ షరతులను అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తామని తెలిపారు.పుతిన్ చేసిన ఈ ప్రకటన పై ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలేస్కీ స్పందించారు.పుతిన్ ప్రకటన మోసపూరితమంటూ జెలేస్కీ అన్నారు.మొదట యుద్ధాన్ని మొదలు పెట్టిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టీన్ అన్నారు. ఇది శాంతి ప్రతిపాదన కాదు.. తీవ్ర దాడికి, మరిన్ని ఆక్రమణలకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఉందని నాటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్‌బెర్గ్ విమర్శించారు.