- బీఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా గూడెం బ్రదర్స్..
- బిఆర్‌ఏస్ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ?
- ఇలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..?
- రేవంత్ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్ చెరు కాంగ్రెస్ క్షేత్రస్థాయి కార్యకర్తలు..
- మహిపాల్ రెడ్డి ఎక్కడికీ వెళ్లిన తిరగబడుతున్న కాంగ్రెస్ జెండా మోసిన శ్రేణులు..
- వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు…
- నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జాకోరులు..
- అమీన్‌పూర్‌లో అన్యాక్రాంతమైన గవర్నమెంట్ లాండ్స్..
- లేఅవుట్‌లో లే అవుట్ సృష్టించిన ఘనాపాఠీలు ఈ బ్రదర్స్..
- మునుత్ ప్రయివేటు ట్రస్ట్ పేరుతో మహావీర్ జైన్ అక్రమాల చిట్టా..
- ప్లాట్ నెంబర్ తో వేల గజాల్లో రిజిస్ట్రేషన్…
- చక్రపూరి కాలనీ లే అవుట్ లో చక్రం తిప్పిన కొత్త కమిటీ..
ఇందుకు యధేచ్చగా సహకరించిన రెవిన్యూ, మున్సిపల్,
రిజిస్ట్రేషన్, హెచ్.ఎం.డి.ఏ, పోలీస్ అధికారులు.. - ఈడీ అధికారుల చొరవతో బట్టబయలైన అక్రమాస్తులు..
- నిషేదిత జాబితాలో పొందుపరిచిన రిజిస్ట్రేషన్ అధికారులు..
- నేటికీ పట్టించుకోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్..!
ఒక సామెత ఉంది.. గరళం శంఖంలో పోస్తే అమృతం అవుతుందా..? అని.. ఇప్పుడు పఠాన్ చెరు రాజకీయాల్లో ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది.. ఎందుకంటే గూడెం మహీపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి.. వీరిద్దరి పేర్లు వింటే అవినీతి అనే పదం సిగ్గుతో కుంచించుకు పోతుంది.. వారి భూ కబ్జాలమీద, మైనింగ్ మాఫియాలా మీద విస్తృత స్థాయిలో కథనాలు వెలువడినప్పటికీ.. కేసులు, బెయిళ్లతో కాలరెగరేసుకుని మరీ తిరుగుతున్నారు.. ఇక ఎందుకైనా మంచిది అన్నట్టుగా సదరు ఎమ్మెల్యే ఇప్పుడు బీ ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడంతో మరింత విమర్శల పర్వాలు చెలరేగుతున్నాయి.. మహీపాల్ రెడ్డి అవినీతి తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఏవిధంగా తనను పార్టీలో చేర్చుకున్నాడు అని మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.. అయితే తాను చేసిన అవినీతి నుంచి తప్పించుకోవడానికే మహీపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు అన్నది ఇక్కడ స్పష్టం అవుతోంది..
అయితే నిజానికి ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేస్తోంది..? గౌరవ కలెక్టర్ అసలు విధులు నిర్వహిస్తున్నారా..? ఎన్నికోట్లు చేతులు మారాయి..? ప్రభుత్వ స్థలాలకు పైసలు కొట్టి మేనేజ్ చెయ్యొచ్చా..? ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి .? ఎక్కడుంది చట్టం..? ఎక్కడుంది నీతి, న్యాయం..? దోపిడీలకు, దౌర్జన్యాలకు మాత్రమే ఈ సమాజంలో స్థానం ఉందా..? అసలు ఎటుపోతున్నాం మనం..? అమీన్ పూర్ లో వెలుగు చూస్తున్న అక్రమాలు చూస్తుంటే..నోరెళ్ళబెట్టక తప్పడం లేదు…పైగా ప్రజా ప్రతినిధులే ప్రజా కంఠకులుగా మారుతుంటే..ఏమని చెప్పాలి..? ఎవరిని అడగాలి..?
సంగారెడ్డి జిల్లాలోని బి.ఆర్.ఎస్ పార్టీ పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి పఠాన్ చెరువు, అమీన్ పూర్ మండల కేంద్రంగా చేసిన అక్రమాల చిట్టా చూస్తే నివ్వెర పోవాల్సిందే.. ఇతగాడికి రిజిస్ట్రేషన్ చట్టం 1908 తో పనిలేదు..22(ఏ)నిషేదిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లలో గల భూములను అట్టే రిజిస్ట్రేషన్ చేసుకోగలడు.. బోగస్ పత్రాలను సృష్టించి ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేయడం ఇతగాడికి వెన్నెతో పెట్టిన విద్యగా ఉంది.. ప్రభుత్వ భూములు ప్రయివేటు భూములుగా మార్చడం అంటే అది ఇతగాడితోనే సాధ్యం అవుతుంది.. మునుత్ ప్రయివేటు ట్రస్టు పేరిట మహావీర్ జైన్ బోగస్ పత్రాలను సృష్టించి ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలు,లక్ష పైగా గజాల్లో రిజిస్ట్రేష న్ ఎలా సాధ్యమైంది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.. అసలు లే అవుట్ లో ఒక్క ప్లాట్ విస్తీర్ణం లక్షకు పైగా గజాల్లో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉంటుందా..?రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎంతకు అమ్ముడు పోయారు..? అన్న విషయం పై నేటికీ విచారణ చేయక పోవడం తో ఉన్నతా ధికారులకు సైతం వాటాలు ముట్టాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారుల పై చర్యలు ఉండవా..? అనే వాదనలు వినిపిస్తున్నాయి.. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన గూడెం మధు సుధన్ రెడ్డి పై అమీన్ పూర్ లో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినా నేటికీ రెవిన్యూ అధికారులు ట్రేస్ పాస్ కేసు నమోదు చేయక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది..
ఈడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తే బట్ట బయలైన గూడెం మధుసూదన్ రెడ్డి
అక్రమాస్తుల జాబితా చూస్తే ఈ విధంగా ఉంది..
కొల్ల శివ కృష్ణ పేరిట సంగారెడ్డిలోని పటాన్‌చెరు మండలం పోచారం గ్రామంలోని సర్వే నెంబర్ 65/ఈ, 66/ లో ప్లాట్ నెం 17 కి సంబంధించి 200 చదరపు గజాల విస్తీర్ణం కలదు..దీని యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ : 33317/2021 గా ఉన్నట్లు తెలుస్తోంది..ఇదే సర్వే నెంబర్ లో ప్లాట్ నెం 18 సంబంధించి 200 చదరపు గజాల విస్తీర్ణం కలదు..దీని యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 33314/2021..ఇదే సర్వే నెంబర్ లో గోప వెంకటేశం పేరు పై సర్వే నెం 65/జుజు 66/??, 65/జు, 66/జులో ఓపెన్ ప్లాట్ నెంబర్ 232 కి సంబంధించి 152 గజాల స్థలం దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 42783/2021 గా ఉన్నట్లు తెలుస్తోంది.. సర్వే నెం 65/జు డ 66/జులో ఓపెన్ ప్లాట్.253 కి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5236/2022 మల్లవోలు శ్రీనివాసరావు పేరు పై ఉన్నట్లు తెలుస్తోంది..అదేవిదంగా అమీన్‌పూర్ మండల మున్సిపల్ అమీన్‌పూర్ గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 152/పార్టు అని పెట్టీ ప్రభుత్వ భూమికి ప్రయివేటు భూమిగా బోగస్ పత్రాలు సృష్టించి 5035 చదరపు గజాల అక్రమంగా దొడ్డి దారిన గోల్డెన్ కి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , సంతోష్ సాండ్, గ్రానైట్ సప్లై కంపెనీ పేరు పై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. ఇట్టి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ 17019/2022 గా అమీన్‌పూర్‌లో 363 చదరపు గజాల విస్తీర్ణంలో సర్వే నెంబర్ లో 137 లో ఓపెన్ ప్లాట్ నెంబర్ 7 కి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 17652/2022 చెల్మేటి వీర ప్రసాద్ పేరిట ఉన్నట్లు తెలుస్తోంది.. అదే విధంగా మహ్మద్ సుమైర్ పేరు పై పఠాన్ చెరువు మండలంలో ఇంద్రేశం గ్రామ శివారులో సిటిజన్స్ కాలనీ సర్వే నెంబర్ 177,178,179 లలో ప్లాట్ నెంబర్ 1 నుండి 28 వరకు మొత్తం 7847.3 గజాలుగా ఉంది.. అలాగే వడ్డీల మహేష్,భూపతి రాజు,వెంకట రామ రాజు ల పేరిట అమీన్ పూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 129,129 పి, 130,130పి లలో ప్లాట్ నెంబర్ 232, 271, 274, 275, 276,277,278 లలో మొత్తం విస్తీర్ణం 2799.98 గజాల స్థలం కలదు.. దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 8942/2023 గా ఉన్నట్లు తెలుస్తుంది.. మునుత్ ప్రయివేటు ట్రస్టు మేనేజర్ గా మహావీర్ జైన్ ఉన్నట్లు సర్వే నెంబర్ 129,130 లలో వడ్డీల మహేష్,గరికపాటి దేవి కిరణ్,భూపతిరాజు వెంకట రామరాజు పేర్ల పై అమీన్ పుర గ్రామ శివారులో ఉన్న ప్లాట్ నెంబర్ 1 నుండి 26 వరకు 5200 గజాల స్థలం తో పాటు,ప్లాట్ నెంబర్ 34,98,156,165,184,186, 191, 203,204 గల ప్లాట్ల కు సంబంధించి ఒక్కొక్క ప్లాట్ విస్తీర్ణం 200 గజాలు చొప్పున మొత్తం 1800 గజాలుగా సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 8943/2023 గా రిజిస్ట్రేషన్ చేసుకొన్నట్లు తెలుస్తోంది.. ఇదే విధంగా సర్వే నెంబర్ 129,130 లలో 15000 గజాలు యేట్టపు నర్సింహులు,ఈ రామాంజనే గౌడ్ ల పేరిట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 8944/2023 గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. అంతే కాకుండా సర్వే నెంబర్ 129పి,130పి లలో ప్లాట్ నెంబర్ 9 లో 366.66 గజాలు,ప్లాట్ నెంబర్ 39 లో 333.3 గజాలు,ప్లాట్ నెంబర్ 44 లో 233.33 గజాలు,ప్లాట్ నెంబర్ 57 లో 200 గజాలు,ప్లాట్ నెంబర్ 58 లో 233. 33 గజాలు,ప్లాట్ నెంబర్ 78 లో 266.66 గజాలు,ప్లాట్ నెంబర్ 136 లో 267 గజాలు,ప్లాట్ నెంబర్ 141/ఏ లో 267 గజాలు,ప్లాట్ నెంబర్ 152 లో 100 గజాలు,ప్లాట్ నెంబర్ 156 లో 153 గజాలు,ప్లాట్ నెంబర్ 164, 206, 210, 214 ,219/పి ప్లాట్లకు సంబంధించి మొత్తం కలిపి 1500 గజాలుగా చాగంటి సతీష్,భూపతి రాజు వెంకట రామ రాజు ల పేరిట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 8945/2023 గా ఉన్నట్లు తెలుస్తోంది.. అమీన్ పూర్ సర్వే నెంబర్ 883/పి లో ప్లాట్ నెంబర్ 85 కి సంబంధించి విస్తీర్ణం 242 గజాలుగా గూడెం మధుసూదన్ రెడ్డి పేరు పై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 20990/2020 గా ఉన్నట్లు తెలుస్తోంది.. పఠాన్ చెరువు మండలంలో పెద్ద కంజర్ల గ్రామ శివారులో సర్వే నెంబర్ 121 లో 106480 గజాలుగా గూడెం మధుసూదన్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5156/2023 గా ఉన్నట్లు తెలుస్తోంది.. అమీన్ పూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 107,108 లలో ప్లాట్ నెంబర్ 520 నుండి 591 వరకు గల ప్లాట్లకు సంబంధించి 11999.52 గజాలుగా శ్రీ రుద్రడేవలపర్స్ పాట్నర్ కోల్ల శివకృష్ణ పేరిట ఉన్నట్లు తెలుస్తోంది.. ప్లాట్ నెంబర్ 46 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 20993/2020,ప్లాట్ నెంబర్ 47, డాక్యుమెంట్ నెంబర్ 20999/2020,ప్లాట్ నెంబర్ 48, డాక్యుమెంట్ నెంబర్ 20998/2020,ప్లాట్ నెంబర్ 49, డాక్యుమెంట్ నెంబర్ 20994/2020,ప్లాట్ నెంబర్ 50, డాక్యుమెంట్ నెంబర్ 20989/2020,ప్లాట్ నెంబర్ 51, డాక్యుమెంట్ నెంబర్ 21001/2020,ప్లాట్ నెంబర్ 52, డాక్యుమెంట్ నెంబర్ 20988/2020,ప్లాట్ నెంబర్ 53, డాక్యుమెంట్ నెంబర్ 21007/2020,ప్లాట్ నెంబర్ 54, డాక్యుమెంట్ నెంబర్ 20995/2020,ప్లాట్ నెంబర్ 55, డాక్యుమెంట్ నెంబర్ 21008/2020,ప్లాట్ నెంబర్ 56, డాక్యుమెంట్ నెంబర్ 21013/2020 రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఇట్టి ప్లాట్ల విస్తీర్ణం మొత్తం 1800 గజాలు గా ఉంది.. పఠాన్ చెరువు మండలంలోని రుద్రారం గ్రామ శివారులో సర్వే నెంబర్ నెంబర్ 702 లో 0.02గుంటలు,703/ఏ లో 0.05 గుంటలు,708/ఏఏ లో 0.06 1/2 గుంటలు,709 లో 0.06 1/2 గుంటల వ్యవసాయ భూమి నేరుడి సహదేవ్ తో పాటు మరో ఐదు గురు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 18435/2020 గా చేసుకున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా పఠాన్ చెరువు మండలంలోలోని పోచారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 65/ఈ,66/ఈ లలో ప్లాట్ నెంబర్ 248 కి సంబంధించిన విస్తీర్ణం 150 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5324/2022,ప్లాట్ నెంబర్ 249 కి సంబంధించిన విస్తీర్ణం 166.6 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5325/2022,ప్లాట్ నెంబర్ 256 కి సంబంధించిన విస్తీర్ణం 150 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5321/2022,ప్లాట్ నెంబర్ 257 కి సంబంధించిన విస్తీర్ణం 150 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5322/2022,ప్లాట్ నెంబర్ 258 కి సంబంధించిన విస్తీర్ణం 150 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5320/2022,ప్లాట్ నెంబర్ 259 కి సంబంధించిన విస్తీర్ణం 684 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5316/2022,ప్లాట్ నెంబర్ 260 కి సంబంధించిన విస్తీర్ణం 577 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5317/2022,ప్లాట్ నెంబర్ 261 కి సంబంధించిన విస్తీర్ణం 533 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5318/2022,ప్లాట్ నెంబర్ 262 కి సంబంధించిన విస్తీర్ణం 444 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5314/2022,ప్లాట్ నెంబర్ 263 కి సంబంధించిన విస్తీర్ణం 400 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5315/2022,ప్లాట్ నెంబర్ 264 కి సంబంధించిన విస్తీర్ణం 311 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5319/2022 లు గా గోప వెంకటేశం అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు తెలుస్తోంది..ప్లాట్ నెంబర్ 265 కి సంబంధించిన విస్తీర్ణం 415 గజాలుగా దీనియొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 5333/2022 నాయికోటి మచేందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. అమీన్ పూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 848/యు2 లో ప్లాట్ నెంబర్ 8 కి సంబంధించి విస్తీర్ణం 124 గజాలు గా కొల్ల శివ కృష్ణ పేరిట డాక్యుమెంట్ నెంబర్ 26817/2019 గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది..సంగారెడ్డి జిల్లాలోని కులబ్ గూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 221,222లో గల ప్లాట్ నెంబర్ 374/ఏ కి సంబంధించి విస్తీర్ణం 100 గజాలుగా ఎస్ రాఘవేంద్ర రావు పేరిట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 9107/2006 గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది..పఠాన్ చెరువు మండలంలోని ఇంద్రేశం గ్రామ శివారులో సర్వే నెంబర్ 154 లో గల ప్లాట్ నెంబర్ 138/ఏ కి సంబంధించి విస్తీర్ణం 90 గజాలుగా పార్ల వెంకటేష్ పేరిట డాక్యుమెంట్ నెంబర్ 24322/2016 గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. పోచారం గ్రామ శివారులో సర్వే నెంబర్ 65/ఈఈ ,66/ఈఈ,65/ఈ,66/ఈ లో గల ప్లాట్ నెంబర్ 206 కి సంబంధించి విస్తీర్ణం 150 గజాలుగా మల్లవోలు శ్రీనివాస్ రావు పేరిట 42813/2021 గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది..అమీన్ పూర్ మండలంలో కిష్టా రెడ్డి పేట గ్రామ శివారులో సర్వే నెంబర్ 133,134,155/ఏఏఈఈఈ లలో గల ప్లాట్ నెంబర్ 85,87/పార్ట్ 1050 స్క్వేర్ ఫీట్ కి సంబంధించి రుద్రసాయి రెసిడెన్సీ లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 52024/2019 మొడుగు నాగలక్ష్మి,మొడుగు శ్యామల రావు ల పేరిట రిజిస్ట్రేషన్ లు చేసుకున్నట్లు తెలుస్తుంది..ఈ యొక్క ప్లాట్లు స్థలాలు గూడెం మధుసూదన్ రెడ్డి కి సంబంధించిన ఆస్తులుగా ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించినట్లు సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిషేదిత జాబిత లో రిజిస్ట్రేషన్ శాఖా అధికారులు పొందు పరిచారు.. ఇందులో ప్రభుత్వ భూములు,అసైన్డ్ భూములు సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఎలా సాధ్యమైంది అన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది..
రెవెన్యూ,రిజిస్ట్రేషన్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వానికి సంబంధించిన వందల కోట్ల విలువైన స్థలాలలను ప్రయివేటు పరం చేయడంతో ఇదెలా సాధ్యమైందని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు.. బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో అక్రమాలను సక్రమం చేసి బోగస్ పత్రాలు సృష్టించి ఇష్టారీతిన అధికారులు అందిన కాడికి దోచుకొని అడ్డగోలు రిజిస్ట్రేషన్ లు చేసుకున్న గత ప్రభుత్వ పాలన ఏ రకంగా సాగిందో.. గతంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సమాధానం చెప్పాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. బిఆర్ ఎస్ పార్టీ పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన తమ్మడు మధు సుధన్ రెడ్డి అడ్డ గోలుగా ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్నా అంతా ఎమ్మెల్యేకు తెలియకుండానే చేశారా..? ఎమ్మెల్యేగా ఎన్నుకుంది అక్రమ సంపాదన పోగు చేసుకోవడానికా..? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన వాగ్దానం ఏమైనట్లు.. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన నాయకులు దోచుకోవడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్త్తున్నారు..
వందల కోట్ల అక్రమాలకు పాల్పడిన గూడెం మధుసూదన్ రెడ్డిపై నమోదైన కేసులో అరెస్ట్ అయి జైలుకు పోయాక కోర్టులో బెయిలు ఎలా వచ్చింది…?
వంద కోట్ల లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన కవితకు ఒక చట్టం,వందల కోట్ల అక్రమాలకు పాల్పడ్డ గూడెం మధు సుధన్ రెడ్డికి మరో చట్టం ఉందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు..రిజిస్ట్రేషన్ చట్టం ఏమి చెపుతుంది.. ప్రభుత్వ భూములు ఎలా రిజిస్ట్రేషన్లు అయ్యాయి..?
మునుత్ ప్రయివేట్ ట్రస్ట్ మహావీర్ జైన్ ఎవ్వరు..? ప్లాట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో లే అవుట్ లో లే అవుట్, హెచ్.ఎం.డి.ఏ ప్లానింగ్ అధికారి యాదగిరి రావు పాత్ర, అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన సుజాత, రెవెన్యూ అధికారుల పాత్ర, సి.ఐ. యూ శ్రీనివాసులు రెడ్డిల పాత్రతో పాటు, ప్లాట్లకు పాసు బుక్కులు పొందిన వ్యవహారం పై, చక్ర పూరి కాలనీ లే అవుట్ లో కొన్ని స్థలాలను వదిలి కొన్ని స్థలాలను మాత్రమే మార్టిగేజ్ చేసిన అక్రమార్కుల చిట్టాతో పూర్తి ఆధారాలతో వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’ .. ‘ మా అక్షరం అవినీతిపై అస్రం ‘..
కాకపోతే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినంతమాత్రాన మహిపాల్ రెడ్డి చేసిన అక్రమాలు మెరుగవుతాయా..? ప్రస్తుతం కళంకం ఆపాదించుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు..? ఎలా సమర్ధించుకుంటారు..? అన్నది వేచి చూడాల్సిన అంశం..