Tuesday, December 3, 2024
spot_img

అడ్డగుట్టలో అడ్డగోలుగా అక్రమ కట్టడాలు

Must Read
  • పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని అడ్డగుట్టలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డులేకుండా పోయింది. అడ్డగుట్ట డివిజన్‌ లో స్థానిక బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. గల్లీ గల్లీలో అడ్డగోలుగా అక్ర మ నిర్మాణాలు నిర్మిస్తుంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసి చూ డనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కిల్‌ పరిధిలోని సీతాఫల్‌ మండి, తార్నాక, బౌద్ధ నగర్‌, అడ్డగుట్టలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను చూస్తే సికింద్రాబాద్‌ టౌన్‌ ప్లానిం గ్‌ అధికారుల అవినీతి ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. అడ్డగుట్టలోని రియో పాయింట్‌ హోటల్‌ ఎదురు గల్లీలో జీహెచ్‌ ఎంసి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం నిర్మించి ఆ నిర్మాణం పూర్తి కావస్తున్నా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఈ అక్రమ నిర్మాణం విషయంలో గతంలో వార్తా పత్రికలలో కథనాలు వచ్చినా అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తార్నాకలోని స్ట్రీట్‌ నెంబర్‌ 13 లో వెంకన్న జూనియర్‌ కాలేజీ పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఓ నిర్మా ణదారుడు అక్రమ పెంట్‌ హౌస్‌ నిర్మించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఇప్పటివరకు పెంట్‌ హౌస్‌ పై చర్యలు తీసుకొ కపోవడం వెనుక భారీగా మామూళ్లు తీసుకున్నారని బహి రంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తార్నాక గోకుల్‌ నగర్‌లోని కే పాల్‌ బోన్‌ సెట్టింగ్‌ సెంటర్‌ కు సమీపంలోని పక్కింటి నంబర్‌ 12-13-1085/31 ఓ నిర్మాణదారుడు పాత భవనం పై నూతనంగా అదనపు అంతస్తు నిర్మాణం నిర్మిస్తున్న అధికారులు ఆ నిర్మాణంపై ఇప్పటి వరకు కన్నెత్తి చూడలేదు. సిరిపురి కాలనీలో ఇంటి నెంబర్‌ 12-1-508/దీ/17/3 నిర్మాణ దారుడు జి ప్లస్‌ 2 పాత కట్టడం పైన నూతన అక్రమ కట్టడం నిర్మిస్తున్న అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఓ పక్క హైదరాబాద్‌ నగరంలో ‘హైడ్రా’ చెరువులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను నిలువునా నేల కూలుస్తుంటే జీహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాల వద్ద నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకొని అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని తీవ్రంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సర్కిల్‌ జోనల్‌ కమిషనర్‌ డిప్యూటీ కమిషనర్‌ స్పందించి అక్రమ నిర్మాణాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిం చి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS