Friday, November 22, 2024
spot_img

కాప్రాలో జోరుగా అక్రమ నిర్మాణాలు

Must Read
  • అక్రమార్కులకు అండగా ఏసీపీ గిరిరాజు
  • ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
  • టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల జేబులు ఫుల్‌
  • జీహెచ్‌ఎంసీ ఖజానా నిల్‌
  • అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు.. ముడుపులు ఇచ్చుకో..అక్రమ నిర్మాణాలు కట్టుకో అంటున్న ఏసీపీ

‘గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు’గా ఉంది సర్కారు అధికారుల తీరు. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముడుపులు తీసుకొని వారికి అండగా నిలబడుతున్నారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు ఎక్కడ పైస దొరికితే అక్కడే ఉండిపోతారు ప్రభుత్వ ఉద్యోగులు. అక్రమార్కులు హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో భూములు, జాగలు ఆక్రమించుకోవడంలో గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ పాత్ర ఉందనడంలో అతిశయోక్తి లేదు. సర్కారు భూములు ఆక్రమణకు గురికావడం, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మా ణాలు చేపట్టడం వంటివి ఊరికనే కావడం లేదు. ఓవైపు రాజ కీయ పలుకుబడి మరోవైపు అధికారుల అండదండలు ఉంటే చాలు అలవోకగా పనికానిచ్చేస్తారు. తెలంగాణలో ఇలాంటివి పదేళ్ల నుంచే దర్జాగా కొనసాగుతున్నాయి. కబ్జాదారులు, అక్రమా ర్కుల దందా మూడు పువ్వులు, ఆరుకాయలు వర్ధిల్లుతున్నా యం టే వీళ్లకు ఫుల్‌ సపోర్ట్‌ ప్రభుత్వ అధికారులదే అనేది జగ మెరిగిన సత్యం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కొందరు అధికా రులు అవినీతికి పాల్పడుతూ అనిశాకు పట్టుబడుతున్న వారి బుద్ది మారడం లేదు. కుక్క తోకకు బండరాయి కడితే సక్క గైతదా అన్న చందాన కొందరు అవినీతి అధికారులు అవి నీతికి పాల్ప డుతూ అక్రమార్కులతో లోపాయికారి ఒప్పందాలు చేసు కొని మాముళ్లు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.

కాప్రా సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాదారులకు ఏసీపీ గిరిరాజు అండదండలు అందిస్తున్నారు. దీంతో అక్రమార్కులు విచ్చల విడిగా రెచ్చిపోతూ నిర్మాణాలు నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతున్నారు. కాప్రా సర్కిల్‌ పరిధిలో ఏసిపి గిరిరాజు అండతో రెసిడెంట్స్‌ ఉన్నటువంటి ఇండ్లను కమర్షియల్‌గా మార్చి ప్రభుత్వానికి కట్టవలసిన ఫీజు ఎగవేత చేయడంతో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుంది. పిస్తా హౌజ్‌, శారదా థియేటర్‌, హైటెన్షన్‌ లైన్‌ పరిధిలో కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. మున్సిపల్‌ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతుండడంతో అక్రమార్కులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారు, ఆదాయాన్ని పెంచాల్సిన ఆఫీసర్లే తమ జేబులు నిండితే చాలు మిగతాది మనకేందుకులే అన్నట్టు వ్యవహారించడం గమనార్హం.

రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ల్యాండ్‌ వ్యాల్యూ పెరగడం, సిటీలో పాపులేషన్‌ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బిల్డింగ్‌ లు కడుతూ యజమానులు కోట్లకు పడగలెత్తుతున్నారు. కనీసం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా, గవర్న మెంట్‌ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అంతస్తుల పైన అంతస్తులు కడుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అక్రమ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా రోజుకో కొత్త అక్రమ నిర్మాణాలు వెలస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిమ్మకు నిరీక్కినట్లు వ్యవహారిస్తున్నారు. కొన్ని అక్రమ నిర్మాణాలు నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారు అంతే కానీ చర్యలు తీసుకోకపోవ డంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుం డడంతో అభివృద్ధి పనులు నత్తన డకన నడుస్తు న్నాయి. అక్రమ నిర్మాణాల పై అధికారుల చర్యలు లేకపోవడంతో నిర్మాణదారులకు అడ్డు అదుపులేక పోవడంతో జోరుగా అక్రమ నిర్మా ణాలు జరుగుతుండడం కోసమెరుపు. అభివృద్ధి కుంటుపడటానికి ప్రధాన వనరులు అయినా భవన నిర్మాణం అనుమతుల ఫీజు రాకపోవడం తో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం అయినా అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించి అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకొని వాటిని కూల్చివేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా అక్రమార్కులకు ఫుల్‌ సపోర్ట్‌ చేస్తూ వాళ్ల వద్ద నుంచి లంచాలు తీసుకొని పనిచేస్తున్న అవినీతి అధికారులపై విచారణ జరిపి వాళ్లను సస్పెండ్‌ చేయాల్సిందిగా కోరుతున్నారు. కాప్రా సర్కిల్‌ పరిధిలో అక్రమార్కులకు అండగా నిలుస్తున్న ఏసీపీ గిరిరాజు అక్రమ సంపాదన, ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చట్టరిత్యా చర్యలు తీసుకోవాల్సింది ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS