Friday, September 20, 2024
spot_img

అక్రమ నిర్మాణాలకు నిలయంగా సూరారం

Must Read

-అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు…

-ప్రభుత్వ నిబంధనలు ఖాతరు చేయని నిర్మాణదారులు…

-ఒక్కో అంతస్తుకి లక్షల్లో వసూలు చేస్తున్న సెక్షన్ ఆఫీసర్…

-గతంలో సైతం పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఆమెపై చర్యలు శూన్యం…

-అమ్మగారికి అందాల్సినవి అందితే అంతా సక్రమము…

గాజుల రామారావు సర్కిల్ పరిధిలోని సూరారం డివిజన్ అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారింది. అనుమతులు లేకుండానే అదనపు అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ నిబంధనలు బేకాతర్ చేస్తున్న అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణ వెలువెత్తుతున్నాయి. జి ప్లస్ 2 మించి నిర్మాణాలు చేపడితే హెచ్ఎండి అనుమతి తప్పనిసరి కానీ సూరారం డివిజన్ లో సెక్షన్ ఆఫీసర్ కి కప్పం కడితే అవేమీ అవసరం లేదనుకుంటున్నారేమో నిర్మాణదారులు. విచ్చలవిడిగా బహుళ అంతస్తులు నిర్మాణం చేపడుతూ ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తున్నారు.

నిబంధన విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణ వల్ల భవిష్యత్తులో అనుకోని సంఘటనలు జరిగితే వాటికి బాధ్యులు ఎవరంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నాళ్లలోనే నిబంధనలకు మించి నిర్మాణాలు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. నిర్మాణదారుల వద్ద సెక్షన్ ఆఫీసర్ ఒక్కో అంతస్తుకి లక్షల్లో వసూలు చేస్తు అక్రమాలను సక్రమం చేస్తున్నారని నిర్మాణదారులు బహిరంగగా చెబుతున్నారు. ఫిర్యాదులు అందితే నోటీసులు జారీ చేసి నామమాత్రపు చర్యలు తీసుకొని మమ అనిపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై ఉన్నత అధికారులు దృష్టి సాధించి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సెక్షన్ ఆఫీసర్ పై నేటికీ చర్యలు శూన్యం

వివిధ డివిజన్లో విధులు నిర్వహించిన ఆమె పలు ఆరోపణలు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ నేటికీ ఆమెపై ఎలాంటి శాఖ పరమైన చర్యలు ఉన్నత అధికారులు తీసుకోలేదు. ఆమె తమ అక్రమ వసుళ్లలో ఉన్నతాధికారులకు సైతం సమాన వాటాలు అందిస్తుందని అందుకే ఆమెపై ఎలాంటి చర్యలు ఉండవని తెలుస్తుంది. అమ్మగారికి అందాల్సిన అందితే ఎంతటి అక్రమ నిర్మాణాలైన వాటిని సక్రమం చేయడంలో ఆమెకు దిట్ట అనే పేరు ఉంది. టౌన్ ప్లానింగ్ లో జరిగే అక్రమాలను అరికట్టే అధికారులు ఉన్నారా? ఉంటే అవినీతి అధికారిపై చర్యలు ఎప్పుడు… గాజుల రామారం సర్కిల్ లో నూజరుగుతున్న అక్రమ నిర్మాణాల పై ఆదాబ్ హైదరాబాద్ మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది… మా అక్షరం అవినీతిపై హస్త్రం…

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This