Saturday, November 23, 2024
spot_img

ఎకరం పేరుతో ఎకరాల భూమికి ఎసరు..

Must Read
  • 111 జీ. ఓ పరిధిలో వెలిసిన అక్రమ లే అవుట్..
  • పంచాయితీ రాజ్ చట్టం 2018 నిబంధనలకు తూట్లు పొడుస్తున్న వైనం..
  • కాసులకు కక్కుర్తి పడి ఆ వైపు కన్నెత్తి చూడని హిమాయత్ నగర్ పంచాయితీ కార్యదర్శి..
  • నాలా కన్వర్షన్ లేదు.. డిటిసిపి అనుమతి లేదు.. చట్టాలతో శశాంక్ యాదవ్ కి పనిలేదు..
  • ప్రభుత్వ ఖజానాకు భారీ గండి..
  • సర్వే నెంబర్ 114 లో అమాయకులకు ఎరవేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్న దోపిడీ దారులు..
  • మొయినాబాద్ మండలంలో ఇక్కడ ప్లాట్లు కొన్నారా అంతే సంగతులుంటున్న విశ్లేషకులు…
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించాల‌ని స్థానిక ప్ర‌జ‌ల డిమాండ్..

ఎకరం భూచిగా చూపి ఎకరాల భూమికి ఎసరు పెట్టి..చట్టాలంటే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తూ…. కేవలం ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తూ..ఆక్రమ వెంచర్లు చేశామా…అమాయకులకు ఎర వేశామా.. కాసులు దోచుకున్నమా..అమాయక ప్రజలను అక్రమాలలోకి లాగమా.. ఏ చట్టం ఏమి చేస్తుంది.. ఏ అధికారులు ఎం చేస్తారు..111 జీ. ఓ ఐతే మాకేంటి..మేము అక్రమ వెంచర్లు చేస్తాం..అందిన కాడికి దోచుకుంటం..వింటే వింతగా ఉన్న ఇప్పుడు తెలంగాణాలో ఇదే జరుగుతోంది..అందుకు మచ్చుకు మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామ శివారులో 111 జీ.ఓ పరిధిలో ఈ అక్రమ వెంచర్ చేసిన శశాంక్ యాదవ్ వ్యవహారం ఇప్పుడు చూద్దాం..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో, హిమాయత్ నగర్ గ్రామ శివారులో శ్రీ పద్మావతి కాలనీ పేరుతో వెలసిన అక్రమ వెంచర్ ఇప్పుడు ఈ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది.. సర్వే నెంబర్ 114లో 4 ఎకరాల 4 గుంటల భూమి అంటూ అక్రమ లేఔట్ చేసి యదేచ్చగా పనులు చేపట్టారు అక్రమార్కులు.. లే అవుట్ అనుమతి పొందాలంటే పట్టా భూమిగా ఉండి నాలా కన్వర్షన్ అయిన తర్వాత పంచాయతీరాజ్ చట్టం 2018 లోని నిబంధనల ప్రకారం డిటిసిపి కార్యాలయం నుండి లేఔట్ అనుమతి పొందాల్సి ఉంటుంది.. కానీ 111 జీవో పరిధిలో ఎలాంటి లేఔట్ అనుమతులు కానీ నిర్మాణాలను కానీ చేపట్టడానికి వీలులేని నిషేధిత ప్రాంతంగా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.. ఇవన్నీ పట్టకుండా అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకున్న ముదిగొండ శశాంక్ యాదవ్ తనకున్న పలుకుబడితో అక్రమ లేఔట్ చేసి అమాయకుల అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాడని ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

రంగారెడ్డి జిల్లా డిపిఓ, డి ఎల్ పి ఓ లు సైతం అక్రమ నిర్మాణాలు, లేఔట్ లు చేస్తే మాకేంటి అన్న చందాన అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.. 111 జీవో పరిధిలో సర్వేనెంబర్ 114 లోని ఎకరం భూమినీ బూచిగా చూపుతూ ఎకరాల భూమికి ఎసరు పెట్టి,ధరణీ లో ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండా చూపిస్తున్న పట్టా భూమినీ అక్రమంగా దొడ్డిదారిన వెంచర్ చేసి, సామాన్య ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టి తమ జేబులు నింపుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.. గతంలో సంబంధిత అధికారులు ఇదే అక్రమ వెంచర్ పై చర్యలు చేపట్టిన.. అయినా ఆగని అక్రమార్కులు కాసుల కోసం కక్కుర్తి పడి మరల యదేచ్ఛగా వెంచర్ చేస్తుండటం స్థానిక పంచాయతీ కార్యదర్శి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం సదరు అధికారి అవినీతికి అద్దం పడుతుంది.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి పంచాయితీ రాజ్ చట్టం సెక్షన్ 268 నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టి, అవినీతి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందియాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. మొయినాబాద్ మండలంలో జరుగుతున్న ముదిగొండ శశాంక్ యాదవ్ చేస్తున్న అక్రమ వ్యవహారాలకు సంబంధించి మరో కథనం ద్వారా ఆధారాలతో సహా వెలుగులోకి తేనుంది ” ఆదాబ్ హైదరాబాద్ ” ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం..’

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS