Thursday, March 13, 2025
spot_img

జోరుగా అక్రమ ఇసుక రవాణా

Must Read
  • వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని సంబందిత అధికారులు
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

వివిధ వాగుల్లో నుండి అక్రమంగా ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఇరుకుల్లా, చేగుర్తి, కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బొమ్మకల్‌ వాగుల నుండి రోజు వందల ట్రాక్టర్లు 24 గంటలు ఇసుకను అక్రమంగా ట్రాక్టర్‌లలో కరీంనగర్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ చోద్యం చూస్తున్నటుగా వవహ రిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఇసుక అక్రమ రవాణాలను అరికట్టవలసిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని బహిరంగ ప్రచారం జరుగుతుంది. గత కొన్ని నెలలుగా కరీంనగర్‌ కు రోజు అక్రమంగా ట్రాక్టర్లపై కరీంనగర్‌ కుఇసుక తరలివస్తుంది. ఇసుక అక్రమ దందాదారులు ఒక్కొక్క ట్రాక్టర్‌ కు మూడు నుండి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో అధికారులకు మామూలు చెల్లించి వేల రూపాయల దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాను అరి కటవలసిందిగా సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవేమీ మాకు పట్టనట్లు వ్యవహరిస్తుండడం పట్ల కిందిస్థాయి అధికారులు మామూల్లె ద్యేయంగా పనిచేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. అక్రమ ఇసుక రవాణా చేసేట్రాక్టర్లకు కనీసం నంబర్‌ ప్లేట్లు కూడా ఉండకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కరీంనగర్‌ పట్టణంలో ఏ గల్లిలో చూసినా అక్రమంగా ఇసుకను తరలించే ట్రాక్టర్లు దర్శనమిస్తుంటుంటాయి. అడపాదడప పోలీసులు మాత్రం కొన్ని పట్టుకొని జరిమానాలను విధిస్తూ వదిలి వేస్తున్నట్టు తెలిసింది. సోమవారం నాడు ఓ మైనర్‌ బాలుడు ఇసుకను లోడ్‌ చేసుకుని వచ్చేటప్పుడు అదుపుతప్పి బోల్తా పడింది ఈ ట్రాక్టర్‌ కు కనీసం నెంబర్‌ ప్లేట్‌ కూడా లేకపోవడం విశేషం. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే అక్రమ ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల పై జిల్లా యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS