Thursday, September 19, 2024
spot_img

కంటోన్మెంట్‌లో..అక్రమ నిర్మాణాల జోరు

Must Read
  • పట్టింపు లేని బోర్డ్‌ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం

కంటోన్మెంట్‌ బోర్డ్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్‌ పురి కాలని ఫేస్‌ వన్‌, ప్లాట్‌ నెంబర్‌ 20/బి,ఎస్‌ సి బి నెంబర్‌ 1-19-162 లో కంటోన్మెంట్‌ బోర్డ్‌ అనుమతి లేకుండా పాత భవనం పై రెండం తస్తుల అక్రమంగా నిర్మాణం చేస్తున్నాడు. స్థానికులు పిర్యాదు చేసిన కంటోన్మెంట్‌ ఇంజనీర్లు చర్యలు చేపట్టడం లేదు. కంటోన్మెం ట్‌ బోర్డు అనుమతి లేకుండా ఒక్క గోడ కడితేనే హుటాహుటి నా వెల్లి కూల్చివేసే కంటోన్మెంటు బోర్డు ఇంజనీర్లు, సిబ్బంది…. ఎలాంటి అనుమతులు లేకుండా పాత భవనం పై రెండు అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ఉన్నారంటే అందులో ఆంతర్యం ఏముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కంటోన్మెంటు బోర్డుకు రావలసిన ఆదాయాన్ని గండికొడుతూ…. అధికారులు అక్రమ నిర్మాణా లను ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తు న్నారు.భవన యజమానితో ఇంజనీర్లు లోపాయి కార ఒప్పందం చేసుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి.ఇలా కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో 7వ వార్డు డైరీ ఫార్మ్‌ రోడ్‌ లో రెండు భవనాలు అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతు న్నాయి.ముడుపులు అందుతే..కంటోన్మెంట్‌ నిబంధనలు వర్తించవా….?అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా కంటోన్మెంట్‌ బోర్డు ఉన్నతాధికారులు, సీఈఓ స్పందించి వెంటనే ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Latest News

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు...
- Advertisement -spot_img

More Articles Like This