- గత కొన్ని రోజులుగా నూతన లోగో పై రేవంత్ సర్కార్ కసరత్తు
- జూన్ 02న రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదల
చేయాలనీ భావించిన ప్రభుత్వం - తాజాగా రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేస్తునట్టు ప్రకటన
- ఇప్పటికే సుమారుగా 200 పైగా సూచనలు
- మరిన్ని సంప్రదింపులు జరపాలని భావిస్తున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర నూతన రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది.గత కొన్ని రోజుల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన లోగో ఆవిష్కరణ కోసం కసరత్తు చేస్తున్నా విషయం తెలిసిందే. తొలుత రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదల చేయాలనీ ప్రభుత్వం భావించింది.అయితే జూన్ 02న ( రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ) రోజు కేవలం రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేస్తునట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న లోగోలో రాచరికపు గుర్తులున్నాయని,వాటిని తొలగించలని ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి , అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా కొత్త లోగో ఉండాలని క్యాబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి నిర్ణయించారు.ఇదే విషయం పై చిత్రకారుడు రుద్రా రాజేశంతో పలుమార్లు రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.రాష్ట్ర నూతన రాజముద్ర పై సుమారుగా 200 పైగా సూచనలు వచ్చినట్టు తెలుస్తుంది.సూచనల పై మరిన్ని సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది.