Wednesday, March 12, 2025
spot_img

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

Must Read
  • సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్‌ విక్టరీ
  • 4 వికెట్ల తేడాతో ఘన విజయం
  • అర్థ శతకంతో రాణించిన కోహ్లి
  • ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు

ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లీ 84 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో బెన్‌ ద్వార్షిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. విరాట్‌ కాకుండా అక్షర్‌ పటేల్‌ 27, శ్రేయాస్‌ అయ్యర్‌ 45, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 28 పరుగులు చేయగా, శుభ్మాన్‌ గిల్‌ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్‌ ను నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌ లో బౌల్డ్‌ చేయగా, శ్రేయాస్‌ ను ఆడమ్‌ జంపా బౌలింగ్‌ లో బౌల్డ్‌ చేశాడు. కొన్నోలీ బౌలింగ్‌లో రోహిత్‌ కూపర్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 96 బంతుల్లో 73 పరుగులు చేశాడు. అలెక్స్‌ కారీ 61 పరుగులు, ట్రావిస్‌ హెడ్‌ 39 పరుగులు చేశారు.

భారత్‌ తరఫున మహ్మద్‌ షమీ 3 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, వరుణ్‌ చక్రవర్తి చెరో 2-2 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్‌ లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఒక దశలో 300 పరుగులు చేసేలా కనిపించిన ఆసీస్‌ కు చివరి ఓవర్లలో కళ్లెం వేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (96 బంతుల్లో 73బీ 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. అలెక్స్‌ క్యారీ (57 బంతుల్లో 61బీ 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో రాణించాడు. ట్రావిస్‌ హెడ్‌ (39) దూకుడుగా ఇన్నింగ్స్‌ ను ఆరంభించినా వరుణ్‌ చక్రవర్తికి బలయ్యాడు. భారత బౌలర్లలో మొహమ్మద్‌ షమీ 3 వికెట్లు తీశాడు. వరుణ్‌ చక్రవర్తి, రవీంద్ర జడేజాలకు చెరో రెండు వికెట్లు లభించాయి. బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాథ్యూ షార్ట్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన కూపర్‌ (0) డకౌట్‌ అయ్యాడు. అయితే ఆ ఆనందం భారత బౌలర్లకు ఎంతో సేపు నిలవలేదు. హెడ్‌ హిట్టింగ్‌ మొదలు పెట్టాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. దాంతో ఆసీస్‌ ఓవర్‌ కు 6 పరుగుల చొప్పున రన్‌ రేట్‌ ను మెయింటేన్‌ చేస్తూ ముందుకు సాగింది. అయితే వరుణ్‌ చక్రవర్తి డేంజరస్‌ హెడ్‌ ను అవుట్‌ చేశాడు.

అనంతరం మార్నస్‌ లబుషేన్‌ (29)తో కలిసి స్మిత్‌ జట్టును ముందుకు నడిపాడు. వీరిద్దరు నెమ్మదిగా ఆడారు. అయితే కీలక సమయంలో లబుషేన్‌ అవుటయ్యాడు. ఆ వెంటనే ఇంగ్లీస్‌ (11) కూడా పెవిలియన్‌ కు చేరాడు. ఈ దశలో స్మిత్‌, అలెక్స్‌ క్యారీలు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు సమయోచితంగా ఆడారు. 30 ఓవర్లు దాటాకా వీరిద్దరు హిట్టింగ్‌ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా 300 పరుగులు చేసేలా కనిపించింది. అయితే స్మిత్‌ ను షమీ అవుట్‌ చేశాడు. ఆ వెంటనే సిక్సర్‌ కొట్టి ఊపుమీద కనిపించిన మ్యాక్స్‌ వెల్‌ (7)ను అక్షర్‌ పటేల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక చివర్లో అలెక్స్‌ క్యారీ అవుటవ్వడంతో ఆస్ట్రేలియా 264 పరుగులకు పరిమితం అయ్యింది.

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS