- బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
- ఎన్నికల ఫలితాలు మోడికి వ్యతిరేకంగా ఉన్నాయి
- మోడీని కాకుండా దేశ ప్రధానిగా వేరే ఎవరకైనా అవకాశం కల్పించాలి
- దేశం మార్పు కోరుకుంటుంది : మమతా బెనర్జీ
బీజేపీ అప్రజస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ సంధర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ భవిష్యత్తులో తప్పకుండా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం మార్పును కోరుకుంటుందని అన్నారు.ఎన్నికల ఫలితాల తీర్పు మోడీకి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. ఈసారి మోడీ ప్రధాని కాకూడదని వేరే ఎవరకైనా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపు జరుగబోయే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తామ పార్టీ నాయకులు, తాను వెళ్లబోమని స్పస్టం చేశారు. బలహీన ప్రభుత్వం అధికారం కోల్పోతే తాను సంతోషిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే రేపు మూడోసారి నరేంద్ర మోడి దేశ ప్రధానిగా ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.