Thursday, March 13, 2025
spot_img

విద్యావంతులు వేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లా..?

Must Read

తెలంగాణ రాష్ట్రంలోని జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడం ఆందోళన కరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రుల, టీచర్స్ శాసన మండలి ఎన్నికలలో విద్యావంతులు ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు అవుతారు. విద్యావంతులే చెల్లని ఓట్లు వేస్తే నిరక్షరాస్యులైన ప్రజల సంగతేమిటి? గతంలో అనేక ఎన్నికల్లో తక్కువ మెజారిటీ ఓట్లతో విజయం సాధించిన ఫలితాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించిన జిల్లాల్లోని కలెక్టర్ లు ఓట్లు వేసే విధానంపై ఎంత అవగాహన కల్పించిన ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో నిర్లక్ష్య, నిర్లిప్తత ధోరణి చెల్లని ఓట్లకు దారి తీస్తుంది. కొంతమంది గ్రాడ్యుయేట్ లు, టీచర్స్ ఎన్నికల రోజు ఎన్నికల భూత్ కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడంలో శ్రద్ధ చూపలేదు.కొంతమంది వేల రూపాయల చేతులు మారి ఓట్లు వేసారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓట్లు వేసిన వారిలో చెల్లని ఓట్లు వేస్తే ఫలితం లో దాని ప్రభావం ఎంతో ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొని వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా ఉత్తర్వులు జారీ చేయాలి. పట్టుభద్రుల, టీచర్స్ శాసన మండలి ఎన్నికలలో చెల్లని ఓట్లు వేసిన వారి డిగ్రీ రద్దు చేస్తామని ప్రకటించాలి. ఎన్నికల ముందు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఎన్నికల అధికారులు ఓటు వేసే విధానం పై అవగాహన కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల, టీచర్స్ ఎం.ఎల్.సి.ఎన్నికలలో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడంతో గెలుపోటములు పై ప్రభావం ఎంతో ఉంది.

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS