Friday, September 20, 2024
spot_img

అంతా మా ఇష్టం.!

Must Read
  • డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ లో అక్రమాల పుట్టా
  • ఇష్టారాజ్యంగా వ్యవహరించిన గత సంచాలకులు
  • 317 జీవో టైంలో అవినీతికి పాల్పడ్డ గడల శ్రీనివాస్‌ రావు
  • 8మంది ఉద్యోగినీలను ఒకే చోటకి మాడిఫికేషన్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేసిన వైనం..
  • పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
  • మరో డిప్యూటీ డైరెక్టర్‌ తో కలిసి కార్యకలాపాలు
  • మెంటల్‌ ఆస్పత్రిలో అక్రమాలకు పాల్పడ్డ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్వేత ముంగ
  • చర్యలు తీసుకోవాలంటూ హాస్పిటల్‌ సూపరిటెండెంట్‌ కంప్లైంట్‌
  • ప్రమోషన్‌ ఇచ్చి ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్‌ ఫర్‌ చేసిన హెల్త్‌ డైరెక్టర్‌
  • ఇద్దరూ కలిసి అనేక అక్రమాలకు పాల్పడట్లు సమాచారం
  • ప్రభుత్వ ప్రమేయం లేకుండా లోపాయికారి ఒప్పందంతో ట్రాన్స్‌ ఫర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయంలో అక్రమాల పుట్టా బయటపడుతోంది. గత హెల్త్‌ డైరెక్టర్‌ గా పనిచేసిన గడల శ్రీనివాస్‌ రావు లీలలు అన్నీ ఇన్నీ కావు. కేంద్ర కార్యాలయం అడ్డగా రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగుల ఉసురు పుచ్చుకున్నాడు. తన అణుయాయులతో చేతికందిన కాడికల్లా దోచుకున్నాడు. వైద్యశాఖలోనే పెద్ద అవినీతి అనకొండగా పేరుపొందారు నాటి డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో తనకు కలిసొచ్చిందని చెప్పాలి. చేతులు తడిపి చాలు ఇష్టమొచ్చిన చోటుకి మార్చారు ఎందరో ఎంప్లాయిస్‌ వద్ద లక్షలు లక్షలు దండుకొని ప్రభుత్వం అనుమతి లేకుండా తన ఇష్టారీతిన ట్రాన్స్‌ ఫర్‌ చేశాడు. ఇతనికి తోడు మరికొందరు పెద్దాఫీసర్లు తోడయినట్లు తెలుస్తోంది. ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్టు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో పాలకులు, ప్రభుత్వ పెద్దలు ఎవరికి తోచినట్టు వాళ్లూ దోచుకున్నారు. ఇదే అదునుగా తీసుకున్న అప్పటి వైద్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాస్‌ రావు కూడా అదేబాటలో పయనించాడు. డిపార్ట్‌ మెంట్‌ లో కొందరి సపోర్ట్‌ తీసుకొని ‘నీకింత నాకింత’ అన్నట్టు అక్రమాలకు పాల్పడేందుకు స్నేహ హస్తం చూసుకున్నారు.


అసలు విషయానికొస్తే ప్రభుత్వ మెంటల్‌ ఆస్పత్రి హైదరాబాద్‌ లో నాడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిచేసే శ్వేత ముంగ అక్కడ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిరది. హెచ్‌.డీ.ఎస్‌ నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. శ్వేత ముంగ హాస్పిటల్‌ అవినీతికి పాల్పడినట్లు తేలడంతో గవర్నమెంట్‌ మెంటల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌.. అప్పటి వైద్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాస్‌ కు కంప్లైంట్‌ చేయడం జరిగింది. డ్యూటీకి సైతం క్రమంగా రాకపోవడం వల్ల ఆమెపై చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయానికి సరెండ్‌ చేశారు. అయితే సదరు ఉద్యోగినీపై డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాస్‌ రావు చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆమెకు ప్రమేషన్‌ ఇచ్చి మరీ వైద్యశాఖ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెకు అడ్మిన్‌ డిపార్ట్‌ మెంట్‌ లో డిప్యూటీ డైరెక్టర్‌ గా పోస్టింగ్‌ ఇచ్చారు. అనంతరం వాళ్లిద్దరూ కలిసి అనేక అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో వీళ్లకు కాసుల వర్షం కురిపించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లక్షల్లో డబ్బులు వసూలు చేసి అక్రమ మార్గంలో కౌన్సిలింగ్‌ ద్వారా పోస్టింగ్‌ వచ్చిన చోటు నుంచి సవరణ ఉత్తర్వుల ద్వారా మరోచోటుకి ఎంప్లాయిస్‌ ను డిప్యూటీ డైరెక్టర్‌ శ్వేత ముంగ, హెల్త్‌ డైరెక్ట్‌ శ్రీనివాస్‌ రావు కలిసి ట్రాన్స్‌ ఫర్‌ చేశారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం లేదా జీఏడీ నుంచి అనుమతులు పొంది మరోచోటుకి బదిలీ కావాల్సి ఉంటుంది. కానీ 8మంది ఉద్యోగులను వేర్వేరు చోట్ల నుంచి ఒకే ప్రాంతానికి ట్రాన్స్‌ ఫర్‌ చేసి లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఎక్కడ్నుంచి ఎక్కడికైనా బదిలీ కావాలంటే తప్పకుండా జీఏడీ నుంచి పర్మిషన్‌ ఉండాలి. కానీ వీళ్లు మూడో కంటికి తెల్వకుండా చీకటి ఒప్పందంతో బదిలీలు చేయడంపై అనేక అనుమానాలు తలెత్తాయి.


1). కె.నాగమణి, (స్టాప్‌ నర్సు) వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో జాబ్‌ చేస్తున్నారు. అయితే 317 జీవో ప్రకారం ఆమెకు ప్రభుత్వ ఆస్పత్రి మంచిర్యాలకు ట్రాన్స్‌ ఫర్‌ వచ్చింది. కాగా ఆమెను శ్వేత, గడల శ్రీనివాస్‌ కలిసి ప్రభుత్వ ఆస్పత్రి మహబూబాబాద్‌ కు బదిలీ చేశారు. అదేవిధంగా 2). విజయశీల, హన్మకొండలోని ప్రభుత్వ టీబీ, చాతి ఆస్పత్రిలో వర్క్‌ చేస్తుండగా ఆమెకు ఆ జీవో ప్రకారం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయింది. ఈమెను కూడా మహబూబాబాద్‌ లోని ప్రభుత్వ హాస్పిటల్‌ కు ట్రాన్స్‌ ఫర్‌ చేశారు. అలాగే 3). బి.మమత, మండల ప్రాథమిక హెల్త్‌ సెంటర్‌ కూసుమంచి (ఖమ్మం జిల్లా)లో అప్పుడు ఉండగా ఆమెకు జగిత్యాలలోని గవర్నమెంట్‌ హాస్పిటల్‌ కు ట్రాన్స్‌ ఫర్‌ అయింది. అయితే ఆమె వద్ద డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఆస్పత్రి మహబూబాబాద్‌ కు బదిలీ చేశారు. మరోవైపు 4). ఎం.శాంత, ఎంజీఎం వరంగల్‌ లో కొలువు చేస్తుండగా ఆమెకు సిద్ధిపేటలోని సర్కార్‌ దవాఖానకు బదిలీ అయింది. కానీ ఆమెను కూడా మహబూబా బాద్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రికి ట్రాన్స్‌ ఫర్‌ చేయించారు. ఇంక 5). ఇ.ఉమా, జూలూరుపాడులోని మండల ప్రాథమిక హెల్త్‌ సెంటర్‌ లో పనిచేస్తుండగా ఆమెకు 317జీవో ప్రకారం గవర్నమెంట్‌ హాస్పిటల్‌ ఆసిఫాబాద్‌ కు ట్రాన్స్‌ ఫర్‌ అయింది. కాకపోతే ఆమెను కూడా మహబూబాబాద్‌ లోని ప్రభుత్వ దవాఖానకు బదిలీ చేయడం జరిగింది. అలాగే 6). పి.వసుమతి (స్టాప్‌ నర్సు) యూపీహెచ్‌.సీ తొర్రూర్‌ లో పనిచేస్తుండగా ఆమెకు సర్కార్‌ ఆసుపత్రి సిద్ధిపేటకు బదిలీ అయింది. కానీ సర్కార్‌ ఆసుపత్రి మహబూబాబాద్‌ కు మార్చారు. ఇకపోతే 7). వై.జానకమ్మ (స్టాప్‌ నర్సు) ప్రాథమిక హెల్త్‌ సెంటర్‌ గుమ్మడివల్లి (కొత్తగూడెం జిల్లా)లో పనిచేస్తుండగా ఆమెకు ప్రభుత్వ ఆస్పత్రి నిర్మల్‌ కు ట్రాన్స్‌ ఫర్‌ వచ్చింది. కానీ ఆమెను మహబూబాబాద్‌ లోని ప్రభుత్వ హాస్పిటల్‌ కు బదిలీ చేయడం జరిగింది. ఇక 8). పి.దేవేంద్ర, మణుగూరులోని మండల ప్రాథమిక హెల్త్‌ సెంటర్‌ లో జాబ్‌ చేస్తుండగా ఆమెకు సీహెచ్‌.సీ గమిరావుపేట (రాజన్నసిరిసిల్ల జిల్లా)కు బదిలీ అయింది. కాగా ఆమెను కూడా మహబూబాబాద్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రికి ట్రాన్స్‌ ఫర్‌ చేయించారు అప్పటి వైద్య సంచాలకులు గడల శ్రీనివాస్‌ రావు.

పైన తెలిపిన 8మందినీ ప్రభుత్వం, జీఏడీ నుంచి అనుమతులు లేకుండా తనకు తాను సొంతంగా ట్రాన్స్‌ ఫర్‌ చేయడంపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనతోపాటు డిప్యూటీ డైరెక్టర్‌ శ్వేత ముంగ సైతం ఇందులో పాలుపంచుకోని అక్రమ మార్గంలో బదిలీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ కేంద్ర కార్యాలయంలో గత సంచాలకులు గడల శ్రీనివాస రావు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ కేంద్ర కార్యాలయంలో గత సంచాలకులు గడల శ్రీనివాస రావు, డిప్యూటీ డైరెక్టర్‌ శ్వేత ముంగ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలపై అదనపు సంచాలకులు వివరణ కోరగా స్పందించలేదు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This