నా దాటికి తట్టుకోలేకే ఓటమి నన్ను
మత్తులో ముంచి ఓడించింది..కనురెప్ప పాటు కాలంలో తిరిగి పుంజుకునే శక్తి
నాలో ఉన్నాక ఈ ఓటమి ఏపాటిది..
మరణం నన్ను శాసించే పరిస్థితే వచ్చినా..
నా ఆలోచనలతో నా అక్షర జ్ఞానంతో మృత్యుంజయ ధ్వజం ఓటమిపై
ఎగరవేస్తానే తప్ప నేను ఓటమిని ఒప్పుకోను..ప్రయత్నించక నేను ఒడిపోలేదు..
కాస్త అలా తాబేలులా కునుకు తీసి కనులు తెరిచే లోపు ఓటమి నాముందు ఉంది..
అయినా నేను ఓటమిని ముద్దాడుతాను గెలుపుకు సోవానాలు
వేసేది, గుణ పాఠాలు నేర్పేది ఓటమి అనే
గురువే కదా..!!
- రవి రాజన్