గాజా పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.తాజాగా మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది.డెయిర్ ఆల్ బాలాహ్ లోని ఓ పాఠశాలపై వైమానిక దళలతో దాడులు చేసింది.ఈ దాడిలో చిన్నారుల సహా మొత్తం 12 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.అనేకమంది పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.మరోవైపు వైమానిక దాడుల్లో అనేక మంది గాయపడి ఉంటారని,మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.