Thursday, April 3, 2025
spot_img

నా పట్టీల శబ్దం విన్న ప్రతిసారి

Must Read

నా పట్టీల శబ్దం విన్న ప్రతిసారి
ఓ తెలియని ఆనందం…

ఇంట్లో పట్టీలు వేసుకొని గళ్ళు గళ్ళు నడుస్తుంటే నాన్న కళ్ళల్లో ఆనందం..
అమ్మ మొహంలో తెలియని వెలుగు

అన్న చూపుల్లో బయటకి చూపని ఓ గర్వం
కానీ ఎందుకో ఆ ఒంటరి అర్ధరాత్రి నా పట్టీల శబ్దం వింటే నాకే భయమేసింది..

నాకేం తెలుసు నా పట్టీల ధ్వని
నా ప్రాణానికి హాని అని..

నా పట్టిల శబ్దం….నేను ఓ అందమైన ఆడపిల్లనని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది..
కానీ ఆ ఒంటరి అర్ధరాత్రి నేను ఆడపిల్లనని గుర్తు చేసుకుంటే భయమేసింది..

ఆరోజు అర్ధమైంది,ప్రతి ఆడపిల్లకి కుస్తీ పట్టడం కూడా రావాలని..

-రత్లావత్ శ్రావణి

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS