100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని అన్నారు.ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు.రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని ఆరోపించారు.రాజకీయం కోసం భక్తుల మనోభావాలతో అడుకుంటారా అని మండిపడ్డారు.దశబ్ధలుగా జరుగుతున్న పద్దతులోనే తిరుమలలో లడ్డు తయారీ జరుగుతుందని తెలిపారు.చంద్రబాబుది 100 రోజుల పాలన కాదని,100 రోజుల మోసమని ఎద్దేవా చేశారు.తిరుమల,తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వ హయంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు నూనె,కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.