ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు మాజీ సీఎం,వైసీపీ పార్టీ అధినేత జగన్.ఏపీలో జరుగుతున్నా వరుస ఘటనల పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు.ఏపీలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని,అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.టీడీపీ గుండాలు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి,అనేక మంది అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు.నివాసాలను ధ్వంసం చేసి,గిట్టనివారి పంటలను ధ్వంసం చేసారని పేర్కొన్నారు.తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులకు ప్రోత్సహించలేదని తెలిపారు.నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతొ హోర్డింగ్ లు ఏర్పాటు చేసి,కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు.వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనా విధించాలని డిమాండ్ చేశారు.జగన్ చేస్తున్న ధర్నాకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యి మద్దతు ప్రకటించారు.