Friday, February 21, 2025
spot_img

కోకాపేటలో జస్విత లక్సరా బరితెగింపు

Must Read
  • జస్విత క‌న్‌స్ట్ర‌క్ష‌న్ అనుమతుల రద్దుకు హెచ్‌.ఎం.డి.ఏ కు లేఖ..?
  • గతంలోనే నిర్మాణాలు నిలిపివేయాలని, నోటీసులిచ్చిన హెచ్‌.ఎం.డీ.ఏ
  • అనుమతులు రద్దయిన ఆగని జస్విత లక్సరా అక్రమ నిర్మాణపు పనులు..
  • యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తుంటే పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు..
  • అక్రమ వ్యవహారంపై న్యాయస్థానానికి ఫిర్యాదు చేసిన కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌
  • కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం
  • కోకాపేట్‌ సర్వే నెంబర్‌ 133 గల భూమిలో జస్విత కన్స్‌ ట్రక్షన్‌ బిల్డర్స్‌ నిర్మాణాలకు మరోమారు కోర్టు ఆదేశాలతో అనుమతులు రద్దు
  • అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్‌ చేస్తున్న సామాజిక కార్యకర్తలు

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొలుదీరిన సర్కారు కూడా గత పాలకుల మాదిరిగానే సరిగ్గా పనిచెయ్యడం లేదా..? కీలకమైన పోలీస్ డిపార్ట్‌మెంట్, ఏసీబీ, ఎన్ఫోర్స్‌ మెంట్‌ వంటి శాఖలు సత్తువ కోల్పోయాయా..? లేక అమ్ముడుపోయాయా..? కింది స్థాయి ఉద్యోగులకు సిస్టం అంటే లెక్క లేదా..? ఏమి చేసినా ఏమీ కాదని, ఇవన్నీ మామూలే అని సరిపుచ్చుకుంటున్నారా..? ఒక సామాన్యుడు ఏమి చూసి ఇల్లు కొనాలి..? ఈ అక్రమ వ్యవహారాలకు పరిష్కారం ఏమిటి..? గత ప్రభుత్వంలో జరిగిన తంతు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంటే సామాన్యుడు తన బాధను ఎవరికీ చెప్పుకోవాలి..? ఎక్కడ చెప్పుకోవాలి..? రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ శివారులో.. సర్వే నెంబర్‌ 133 గల భూమిలో, జస్విత లక్సర్‌ కన్‌ స్ట్రక్షన్‌ వారు, రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్‌ ఫ్లోర్‌ 9 అప్పర్‌ ఫ్లోర్స్‌ తో రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తున్నారు..ఈ నిర్మాణానికి అప్పట్లో హెచ్‌.ఎం.డీ.ఏ. మరియు ‘రేరా’ నుంచి మల్టిపుల్‌ డాక్యుమెంట్స్‌ తో పర్మిషన్‌ పొందారని, అది అక్రమ నిర్మాణమని, కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌ అనే వ్యక్తి, జాతీయ కమిషన్‌ బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌, భారత సోషియల్‌ జస్టిస్‌, సాధికారిత మంత్రిత్వ శాఖ వారికి, ఫిర్యాదు చేయడం జరిగింది.. ఈ నేపథ్యంలో హెచ్‌.ఎం.డీ.ఏ. వారు జస్విత కన్‌ స్ట్రక్షన్‌ వారికి, నిర్మాణాలు నిలిపివేయాలని, నోటీసు నెంబర్‌ : 6/హెచ్‌.ఎం.డీ.ఏ./ 29032018 ద్వారా 05/11/2021 తేదీ నాడు, నోటీసులు జారీ చేయడం జరిగింది.. కాగా ఇదివరకే, ఆర్తి కన్‌ స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుమీద అగ్రిమెంట్‌, జీపీఏ ఉన్నా.. హెచ్‌.ఎం.డీ.ఏ. పర్మిషన్‌ ఇవ్వడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి.. కరణ్‌ కోటి ప్రేమ్‌ కుమార్‌ తండ్రి మోతిలాల్‌, అజీజ్‌ తండ్రి కి ఏజీపీఏ డాక్యుమెంట్‌ నెంబర్‌: 4294, తేదీ 28/10/1999 నాడు చేసిన జీపీఏ డాక్యుమెంట్‌ ని పరిశీలించిన హెచ్‌.ఎం.డీ.ఏ. వారు పరిశీలించి, ఏజీపీఏ డాక్యుమెంట్‌ నెంబర్‌ 1043 ఆఫ్‌ 2005 తేదీ 30/04/2004 నాటి డాక్యుమెంట్‌ ను కూడా పరిశీలించి, రాజేంద్రనగర్‌ మండల రిజిస్ట్రేషన్‌ కార్యాలయం జారీ చేసిన, సేల్‌ డీడ్‌ డాక్యుమెంట్‌ నెంబర్‌ : 4521 తేదీ, 28/05/2004 ని ఏజీపీఏ నెంబర్‌ : 1043 ఆఫ్‌ 2005, తేదీ : 30/04/2004 ని ఉటంకిస్తూ.. కడుతున్న బిల్డింగ్‌ పర్మిషన్‌ ఇన్‌ వాల్యూడ్‌ అని తేలుస్తూ , అండర్‌ సెక్షన్‌ 22 ఆఫ్‌ హెచ్‌.ఎం.డీ.ఏ. ద్వారా అవకతవకలు జరిగినట్లు హెచ్‌.ఎం.డీ.ఏ. తేల్చి చెప్పింది..కాగా అక్రమంగా వక్రమార్గంలో అనుమతులు పొందారని నిర్దారణ అయ్యాక జస్విత కన్స్‌ ట్రక్షన్స్‌ అనుమతులను రద్దు చేయడం జరిగిందని అధికారులు చెబుతున్నారు..

ఇదిలా ఉంటె.. హెచ్‌.ఎం.డి,ఏ అనుమతులు రద్దు చేసిన తర్వాత రెరా వెబ్సైట్‌ లోనుండి తొలగించుటకు ఫిర్యాదు చేయడం జరిగింది.. అక్రమంగా జస్విత కన్స్‌ ట్రక్షన్స్‌ రెరా నుండి పొందిన సర్టిఫికెట్‌ నెంబర్‌ పి 02400001886 ని తొలగించుటకు రెరా కార్యాలయంలో ఇచ్చిన పిర్యాదు పై స్పందించిన రెరా సెక్రెటరీ లెటర్‌ నెంబర్‌ 228/2021/టి.ఎస్‌.రెరా,తేది : 05-02-2022 గల లేఖ ద్వారా హెచ్‌.ఎం.డి.ఏ కమిషనర్‌ పరిమిషన్‌ క్యాన్సల్‌ చేసిన విషయాన్ని తెలుపుతూ, జస్విత లక్సర్‌ రెరా నుండి తేది :-21-03-2020 న పొందిన సర్టిఫికెట్‌ పి 02400001886 ని క్యాన్సల్‌ చేయుటకు రిమార్క్స్‌ అడిగారు.. కానీ నేటికీ అనుమతులు రద్దైన అక్రమంగా నిర్మాణ కొనసాగుతుండటంతో సంబంధిత మున్సిపల్‌ అధికారుల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అమాయక ప్రజలు నష్ట పోకుండా,యథేచ్ఛగా కడుతున్న జస్విత లక్సర్‌ కోకాపేట లో అనుమతులు లేకుండా కడుతున్న అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని పలువురు సామజిక కార్య కర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.. జస్విత లక్సర్‌ నిర్మాణ సంస్థ పై కోర్టు ఏం చెప్పింది.. ఈ యొక్క అక్రమ నిర్మాణం పై తీసుకున్న నిర్ణయాలు.. వీరు చేసిన అక్రమ నిర్మాణానికి సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం అవినీతిపై అస్త్రం..

కోర్టులను సైతం ఖాతరు చేయని అధికారులు :-
కోర్టులు మొట్టికాయలు వేసిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ శివారులో.. సర్వే నెంబర్‌ 133 గల భూమిలో, జస్విత లక్సర్‌ కన్‌ స్ట్రక్షన్‌ వారు, రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్‌ ఫ్లోర్‌ 9 అప్పర్‌ ఫ్లోర్స్‌ తో రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం పనులు చేపడుతున్నారు..ఇట్టి నిర్మాణాలకు చట్టబద్దత లేదని కోర్టులు తేల్చి చెప్పిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు..నిజానికి జస్విత కన్స్‌ ట్రక్షన్‌ బిల్డర్స్‌ ఫోర్జరీ డాకుమెంట్స్‌ తో హెచ్‌.ఎం.డి.ఏ అనుమతులు పొందారు..ఇట్టి విషయాన్నీ తెలుసుకున్న అసలు హక్కుదారుడైన కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌ జాతీయ కమిషన్‌ బ్యాక్వర్డ్‌ క్లాసెస్‌, భారత సోషియల్‌ జస్టిస్‌, సాధికారిత మంత్రిత్వ శాఖ వారికి, ఫిర్యాదు చేయడం జరిగింది.దీనిపై విచారణ చేపట్టిన కమిషన్‌ జస్విత కన్స్‌ ట్రక్షన్‌ బిల్డర్స్‌ చేపట్టిన నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించింది..తరువాత జస్విత కన్స్‌ ట్రక్షన్‌ బిల్డర్స్‌ అధికారులతో కుమ్మక్కయి స్వంత పూచీకత్తులపై పర్మిషన్లు తీసుకుని రీ ఓపెన్‌ చేయడం జరిగింది….ఇట్టి విషయాన్నీ తెలుసుకున్న అసలు హక్కుదారుడైన కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు..ఈ మేరకు న్యాయస్థానం అసలు హక్కుదారుడైన కరణ్‌ కోటే ప్రేమ్‌ కుమార్‌ అనుకూలంగా తీర్పును ఇచ్చింది..జస్విత కన్స్‌ ట్రక్షన్‌ బిల్డర్స్‌ సర్వే నెంబర్‌ 133 గల భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని తేల్చి చెప్పింది..నగరంలో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.. నివాసగృహం కొందామని ఆశతో.. చెమటోడ్చి ఒక్కోపైసా దాచుకుని, తమకు అనువైన ప్రదేశంలో, ఒక ఫ్లాట్‌ చూసుకుని తమ బడ్జెట్‌ లో వస్తుందని నిర్ధారణ చేసుకుని, సదరు బిల్డర్‌ ని సంప్రదిస్తారు.. ఇక బిల్డర్స్‌ చూపించే అందమైన ఫోటోలు.. వారు చూపించే పర్మిషన్‌ పేపర్ల ఆధారంగా అడ్వాన్సు చెల్లిస్తారు.. ఆ తర్వాత తాము కొనబోయే ఫ్లాట్‌ లీగల్‌ గా ఉందా..? లేదా..? అన్నది పరిశీలన చేసుకుంటారు. హెచ్‌.ఎం.డీ.ఏ., రేరాలో ఉందా..? లేదా..? అన్నది చూసుకుంటారు.. పర్మిషన్‌ కరెక్ట్‌ గానే ఉందని నమ్మిన తరువాత రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. ఇక అక్రమ మార్గంలో పొందే అనుమతులు రద్దయిన విషయం తెలియక సామాన్యులు ఉక్కిరిబిక్కరి అయిపోతున్నారు…

సామాన్యులు తెలియక మోసపోతే వీరి పరిస్థితి.. ‘రేరా’కు పట్టదా ..?
ముడుపులు పుచ్చుకుని, తమ స్వార్ధ ప్రయోజనాలకోసం పర్మిషన్‌ ఇస్తున్న అధికారులను అడ్డుకునేవారు లేరా..? ప్రభుత్వ ఉన్నతాధికారులు గానీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్థాయి అధికారులకు గానీ, సంబంధిత మంత్రిత్వ శాఖకు గానీ జరుగుతున్న అవకతవకలు కనిపించవా..? ఒకవేళ తమ దృష్టికి వచ్చిన పట్టించుకోకుండా.. ఏమి చేస్తున్నారు..? బహుశా వీరి చేతులు కూడా ముడుపులతో తడిచి వుంటాయేమో..? ఇలాంటి అన్యాయాలు తమ వారికి గానీ, తమ కుటుంబసభ్యులకు గానీ ఎదురైతే ఇలాగే చూసీ, చూడనట్లు వదిలేస్తారా..? కాగా జస్వితకు హెచ్‌.ఎం.డీ.ఏ. పర్మిషన్‌ క్యాన్సిల్‌ చేసినా నేటికీ రెరా నుండి తొలగించక పోవడం ఎంతవరకు సబబు..? అని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు..? స్వార్ధ ప్రయోజనాలకోసం పర్మిషన్లు ఇచ్చేవారి మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పలువురు సామజిక వేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు..

Latest News

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం..

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఆనంద్‌ కుమార్‌ను అరెస్టు చేసిన ఎసిబి తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం పైలెట్‌ ప్రాజెక్టు సాంక్షన్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS