- నోటీసు పై జూన్ 15లోగ వివరణ ఇవ్వాలని తెలిపిన కమిషన్
- జులై 30 వరకు సమయం కోరిన కేసీఆర్
- గత ప్రభుత్వ హయంలో విద్యుత్ కొనుగోల్లో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ కి జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్ నోటీసులు పంపింది.ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్ర తెలియజేయాలని కమిషన్ కోరింది.జూన్ 15 లోగ సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరగా కేసీఆర్ జులై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తుంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహ రెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది.ఇదిలా ఉంటే సోమవారం మాజీ సీఎండీ ను జస్టిస్ నరసింహ కమిషన్ విచారించింది.ఇప్పటికే కొంత మంది అధికారులను విచారణకు పిలిచినా కమిషన్ కీలక అంశాల పై అధికారులను ప్రశ్నించారు.తాజాగా ఈ రోజు తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు అందజేసింది జస్టిస్ నరసింహ రెడ్డి కమిషన్.
ఛత్తీస్ ఘడ్,భద్రాద్రి,యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ జరుగుంటుందని, 25 మందికి ఇప్పటికే నోటీసులు అందజేశామని జస్టిస్ నరసింహారెడ్డి రెడ్డి తెలిపారు.