Monday, April 21, 2025
spot_img

మంత్రి ప‌ద‌వి.. వ‌యా అమెరికా..

Must Read
  • సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం..
  • కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హరిస్ లేఖ రాసినట్లు కథనం..
  • కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు
  • పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగివుందా..?
  • కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా..?
  • ఛానల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు
  • ఆధారాలు లేకుండా కథనాలు ప్రసారం చేయడం చట్టరీత్యా నేరం
  • ప్రశ్నిస్తున్న శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఫౌండర్ నల్ల సురేష్ రెడ్డి
  • నిజా నిజాలు బయటకు తీయాల‌ని తెలంగాణ‌ డీజీపీకి విజ్ఞప్తి

ఫోర్త్ ఎస్టేట్ గా గౌరవించబడుతున్న వ్యవస్థ నానాటికీ దిగజారిపోతోందా..? తమ రేటింగులను పెంచుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్న న్యూస్ చానల్స్ వల్ల ఇటు సమాజంలోనూ.. అటు రాజకీయ వర్గాల్లోనూ అయోమయం నెలకొంటోంది.. సుళువుగా పాపులారిటీ సంపాదించడానికి కొన్ని చానల్స్ ప్రయత్నిస్తూ ఉంటే.. మరికొన్ని చానల్స్ రాజకీయ ప్రాపకాండ కోసం పనిచేస్తున్నాయన్నది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది.. పేరున్న ఒక న్యూస్ ఛానల్ ఒక నిరాధారమైన కథనాన్ని ప్రసారం చేయడంతో తెలంగాణ‌లో ఇప్పుడు అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.. మరి దేనికోసం ఈ కథనాన్ని ప్రసారం చేసిందో ఆ ఛానల్ యాజమాన్యానికే తెలియాలి.. ఈ కథనం వెనుక ఏదైనా కుట్రకోణం దాగుందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.. ఏకంగా ఒక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేకు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారీష్ కు లింక్ పెడుతూ ఆమె ఈ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్లు కథనాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రసారం చేయడంపై ఆంతర్యం అర్ధం కాక రాజకీయ విశ్లేషకులు, మేధావులు తలలు పట్టుకుంటున్నారు.. అసలు ఆ ఛానల్ ప్రసారం చేసిన కథా సారాంశం ఏమిటో ఒకసారి చూద్దాం..

కొన్ని వార్తా ప్రసారాలు ఔరా అనిపిస్తాయి.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.. ఇంకొన్ని ఆలోచింపజేస్తాయి.. కొన్ని ప్రసారాలు ఇది నిజమేనా అన్న అనుమానాలు రేకెత్తిస్తాయి.. మరి కొన్ని అర్ధం కాక గందరగోళానికి గురిచేస్తాయి.. అలాంటి కథనాన్నే పేరున్న ఓ న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది.. ఆ కథనం ఇప్పుడు తెలంగాణ‌ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పేరును హెడ్ లైన్స్ లో చోటుచేసుకునేలా చేసింది.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తలగోక్కునేలా చేసింది.. అసలు విషయం ఏమిటంటే..

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి, పదేళ్ల బీ.ఆర్.ఎస్. పార్టీని మట్టికరిపించింది.. రేవంత్ రెడ్డి డైనమిక్ నాయకత్వంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 16 నెలలు దాటిపోయింది.. మిగతా విషయాలను పక్కనబెడితే.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో సహా కేవలం 12 మంది మంత్రులు మాత్రమే తమ విధులను కొనసాగిస్తున్నారు.. చాలా మటుకు శాఖలు ముఖ్యమంత్రి ఆధీనంలోనే కొనసాగుతున్నాయి.. కాగా తెలంగాణ క్యాబినెట్ లో ఇంకా 6 మందిని మంత్రులుగా నియమించడానికి అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణ నేడో రేపో అంటూ కాంగ్రెస్ అధిష్టానం ఊరిస్తూ వుంది.. ఈ క్రమంలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.. తమకే అవకాశం వస్తుందని చాలా మంది ఆశతో ఉన్నారు.. కానీ వారి ఆశలమీద నీళ్లు జల్లుతూ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు అని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.. అయినాసరే ఆశావహులు తమ ప్రయత్నాలను మానడం లేదు.. ఎవరి ఫంథాలో వారు తమ గేమ్ ప్లానులు అమలు చేస్తూనే ఉన్నారు.. కానీ అధిష్టానం దృష్టిలో ఎవరున్నారో..? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయాలు మాత్రం అర్ధంకావడం లేదని విశ్లేషకులు అంటున్న మాట.. ఈ క్రమంలోనే పార్టీలోని సీనియర్లు మాత్రం గంపెడు ఆశను పెట్టుకున్నారు అన్నది వాస్తవం.. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊరిస్తూ వచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పుడా ఊసే లేదు..

అయితే ఇప్పుడు ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది.. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి ఇప్పించాలంటూ ఏకంగా అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారీష్ కు మొరపెట్టుకున్నాడట.. దీనిని పరిగణలోకి తీసుకున్న కమలా హారీష్ ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా రికమెండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఒక లేఖ సైతం రాసిందట.. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ఒక కథనాన్ని ప్రసారం చేసింది.. ఇదే ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఆ కథనంలో కమలా హారీష్ రాహుల్ గాంధీకి లేఖ రాయడం.. ఆ లేఖ ఆధారంగా ఆ సిన్సియర్ ఎమ్మెల్యే ఎవరు అన్నది తెలుసుకోమంటూ రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఆదేశాలు ఇచ్చాడని ఆ కథనంలో ఉంది .. ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే.. రాహుల్ గాంధీకి సిఫారసు చేస్తూ లేఖ రాసిన కమలా హారీష్ ఆ ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకుండానే లేఖ రాసిందా..? ఇది మరీ విడ్డూరంగా ఉంది.. ఇలాంటి అసత్య కథనాలను ప్రసారం చేసిన ఆ న్యూస్ ఛానల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఏకంగా ఒక తెలంగాణ ఎమ్మెల్యేకు, కమలా హారీష్ కు లింక్ పెట్టి అద్భుతమైన కథనాన్ని ప్రసారం చేసిన ఆ ఛానల్ వాళ్లకి ఇంత చిన్న లాజిక్ తెలియకపోవడం నిజంగా మూర్ఖత్వం అనుకోవాలా..? లేక ఎదో రేటింగ్ పెంచుకోవడానికో.. లేక ఇంకా ఏపార్టీకో కొమ్ముకాసి మార్కులు కొట్టేయడానికో చేసిన ప్రయత్నం లాగానే కనిపిస్తోంది.. అసలే మంత్రివర్గ విస్తరణ వాయిదాలతో అధిష్టానం మీద గుర్రుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ కథనం చూసి మరింత అసహనానికి గురి అవుతున్నారట.. ఇందులో ఎంత నిజముందో తెలియదు గానీ.. ఇలా వార్తా కథనాలను ప్రసారం చేసి ప్రజలను, నాయకులను అయోమయానికి గురిచేసిన న్యూస్ ఛానల్ పై మాత్రం ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి..

ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ ప్రాంతానికి చెందిన ప్రతిష్టాత్మక శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, ఫౌండర్ అయిన నల్ల సురేష్ రెడ్డి అనే నాయకులు ఒక్కడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు.. తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిన ఆ న్యూస్ ఛానల్ పై తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.. అసత్య కథనాన్ని ప్రసారం చేసినందుకు ఆ ఛానల్ పై, ఛానల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు..

సదరు ఎమ్మెల్యే మాత్రం నేను గత ఐదేళ్లుగా అసలు అమెరికాకే పోలేదు. నాకు హైకమాండ్‌తో మంచి పరిచయం ఉంది నేను అక్కడి నుంచి ఫైర‌వి చేయించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి లేఖ‌ ఎవరు రాసినట్లు.. ఆకతాయి చేసిన పనా..? లేక ప్రత్యర్ధులు చేసిన వ్యవహారమా..?

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS