ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయల్దేరారు.మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.నిన్న రాత్రి తిహార్ జైలు నుండి విడుదలైన కవిత ఢిల్లీలోని తన నివాసంలోనే బస చేశారు.బుధవారం భర్త అనిల్,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.సాయింత్రం వరకు కవిత హైదరాబాద్ చేరుకుంటారు.ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు.