సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి మరణం పట్ల సంతపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా,కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా,రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని తెలిపారు.వారి సేవలను స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి భారత కార్మిక లోకానికి,లౌకిక వాదానికి తీరని లొటని అన్నారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.