Friday, September 20, 2024
spot_img

కేజ్రీవాల్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు

Must Read
  • బీజేపీ లోక్ సభ ఎంపీ సుశ్రీ బాన్సురి స్వరాజ్

మనీష్ సిసోడియా,అరవింద్ కేజ్రీవాల్,ఆప్ నాయకత్వం వివిధ కుంభకోణాలకు పాల్పడిందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎంపీ సుశ్రీ బన్సూరి స్వరాజ్ విమర్శించారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుశ్రీ బాన్సురి మాట్లాడుతూ,2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు.7 సార్లు బెయిల్ తిరస్కరించబడిందని అన్నారు.17 నుంచి 18 నెలల పాటు మనీష్ సిసోడియా జైలు శిక్ష అనుభవించారని వెల్లడించారు.విచారణలో జాప్యం జరగడం వల్లే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు.ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా మనీష్
సిసోడియా విద్యార్థులను పాఠశాల నుండి మధుశాలకి తీసుకెళ్లే ఘోర పాపానికి పాల్పడ్డారని ఆరోపించారు.ట్రయల్ కోర్టు మనీష్ సిసోడియాను మద్యం కుంభకోణానికి ప్రాథమిక రూపకర్తగా గుర్తించిందని,మనీష్ సిసోడియా ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని కోర్టు నిర్ధారించిందని వ్యాఖ్యానించారు.రూ.338 కోట్ల నగదు లావాదేవీకి సంబంధించిన ఆధారాలను సుప్రీంకోర్టు కనుగొందని వెల్లడించారు.మనీష్ సిసోడియా తన పాస్‌పోర్టును అప్పగించాలని,ప్రతి సోమవారం పోలీసులకు రిపోర్టు చేయాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కేజ్రీవాల్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు.మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం విధానపరమైనదేనని వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తుందని ఆమె ఉద్ఘాటించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This