- అధికారం మనదైతేనే మన సమస్యలకు పరిష్కారం
- ముదిరాజులు మీ పేరు పక్కన ముదిరాజ్ అని పెట్టుకోండి
- అన్ని ప్రశ్నలకు,సమస్యలకు ముదిరాజ్ ట్యాగ్ సమాధానమిస్తుంది
- మనలో ఐకమత్యం లేకపోవడమే మన వెనుకబాటుతనానికి కారణం
- చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేదాకా కలిసి పోరాడుదాం
- జన గణనలో కులగణన..బీసీ బిల్లు కోసం మనమంతా దేశ వ్యాప్త ఉద్యమం చేద్దాం
- మన హక్కులు, మన బానిస సంకెళ్లను మన తలరాతలను మనమే మార్చుకుందాం
- ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పిలుపు
ముదిరాజుల హక్కుల సాధనకై ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని రామాయంపేట లో మెదక్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు ముదిరాజ్ అధ్యక్షతన ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరుకు పదిమంది చైతన్యవంతులను తయారు చేయాలని, రాజ్యాధికారం ఎలా రాదో చూద్దామని పేర్కొన్నారు..ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా సంఘం నిర్మాణంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొచ్చిన అయన ..ప్రక్షాళన దిశగా ముదిరాజ్ మహా సభ అడుగులు వేస్తుందని అన్నారు.ఇటీవల కాలంలో జిల్లాల వారీగా పార్టీలకు అతీతంగా నాయకులతో, పెద్దలతో , యువ కులతో ,మహిళలతో సభలు, సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించి ముదిరాజ్ జాతిని బలోపేతం చేసే దిశగా అడుగులువేస్తున్నామని వీరేశ్ అన్నారు.పెద్దలు మన జాతికి దైవ సామానులు కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ ఆశీస్సులతో..మన పెద్దలు కాసాని జ్ఞానేశ్వర్ సూచనల మేరకు గొప్ప ఈకార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడమైనదని వీరేశ్ అన్నారు.
మిత్రులారా మనం ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలి ..
తరాలు మారిన మన తలరాతలు ఎందుకు మారడంలేదో..తెలుసా మిత్రులారా మనలో ఐకమత్యం లోపించడమే ప్రధాన కారణం..విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ , హోదా వంటి అనేక రంగాలలో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతూనే ఉన్నారు ..ఒక ఊరిలో మనోళ్ల సమస్యని మన ఇంటి సమస్యగా ప్రతీ ముదిరాజ్ భావించి ఆ సంఘటనపై, సమస్యపై గళం విప్పిన రోజు మనకు అన్యాయం జరిగిందని సమావేశాలు పెట్టుకోవాల్సిన సందర్భం రాదని వీరేశ్ స్పష్టం చేశారు.ఈ వేదిక సాక్షిగా నేను మిమ్ములను ఒక్కటే అడుగుతున్న..మనవాళ్లకు కష్టం వస్తే సరిహద్దులను చూసుకోకండి ,వైషమ్యాలు మరిచిపోండి,ఉన్నోడు..లేనోడని తారతమ్యాలు మనస్సులో పెట్టుకోకండి..సమస్య సమసిపోయేంత వరకు ఒక్కటిగా పోరాడండి ..మన ఇంటిపేర్లు వేరుకావొచ్చు..కానీ మనమంతా కృష్ణ స్వామి ముదిరాజ్ వారసులమేనని మనస్సులో గుర్తుపెట్టుకోండి..
అధికారం మనదైతేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది :
ఇక మనం గొంతెత్తి అడుగకపోతే ..నిదురనుంచి మేల్కొని ఉద్యమించకపోతే..మనమంతా ఐకమత్యంగా కలిసి ఉండమని భీష్మించుకుని కూర్చుంటే మన తలరాతలు ఎప్పటికి మారవు .మన బతుకులు బాగుపడవు..రండి.. కలిసి నడుద్దాం ..పోరాడుదాం ..ఉద్యమిద్దాం ..బానిస బతుకుల నుంచి విముక్తి దొరికే వరకు ..రాష్ట్రంలో మన బీసీలు అధికారంలోకి వస్తేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి .మనవి కానీ పార్టీలకు మనం ఇప్పటివరకు చేసిన ఊడిగం చాలు..ఇక మన పాలన తెచ్చుకునేవిధంగా మనమంతా కలిసిపనిచేయాలి, అవకాశం ఉన్న చోట మన అభ్యర్థులను నిలబెట్టుకోవాలి. గెలిపించుకునే బాధ్యతలను కూడా మనమే స్వీకరించాలి..
సోదరులారా ..మనమే కీలకం కానీ మనకు ఎందుకు షరతులు వర్తిస్తున్నాయి..:
దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 50 శాతానికి మించి ఉన్న మన బీసీలకు అధికారంలో వాటా ,రాజకీయ రంగంలో ప్రాతినిథ్యం 14 శాతం కూడా ఎక్కడా దాటడం లేదు..బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్యాయం మాత్రమే జరుగుతుంది ..ఈ వేదిక ద్వారా మిమ్ములను కోరుతున్నాను మన హక్కుల సాధన పరిపూర్ణం అవ్వాలంటే మనకు పరిపూర్ణమైన రాజ్యాధికారం కావాలి..మనం…నాయకులుగా ఎదగాలి .చట్టాలు చేయగలిగే స్థితిలో ఉండాలి.అప్పుడే మన బతుకులు మారుతాయి.మన తల రాతలు కూడా మారుతాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్, మందు మూల సపాన దేవ్,జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ ప్రసాద్,నిజామాబాద్ అధ్యక్షులు కరాటే రమేష్ ,ప్రముఖ న్యాయవాదులు పాండు, వినోద్, ముదిరాజ్ యువత అధ్యక్షులు తలారి శ్రీకాంత్ సీనియర్ నాయకులు నారాయణ ముదిరాజ్ తో పాటు స్థానిక నేతలు పుష్పలత,జగన్, తలారి బిక్షపతి మెదక్ జిల్లా ప్రధానకార్యదర్శి ,జిల్లా మహిళ అధ్యక్షురాలు సుజాత ,జిల్లా అధ్యక్షులు సిద్ద రాములు,వైస్ ప్రెసిడెంట్ నరేష్ ,ముఖ్య కార్యదర్శులు నర్సింహులు, భూమా రమేష్ , అక్కల మల్లేశం, బండి ఆనంద్ ,నర్సయ్య, రమాకాంత్, మల్లేశం తో పాటు పలువురు వివిధ పార్టలకు చెందిన నాయకులు,కుల పెద్దలు, మహిళలు, యువతీ,యువకులు పాల్గొన్నారు.