Friday, September 20, 2024
spot_img

మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కిషన్ రెడ్డి

Must Read

బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు
ఈ సందర్బంగా మాట్లాడిన ముఖ్యంశాలు
గనుల Exploration కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భం. ప్రభుత్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకం లో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్ సంబంధిత వర్గాల సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో వైవిధ్యంగా ముందుకు వెళ్తున్నాం. గౌరవ ప్రధాన మంత్రి శీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి చొరవ తో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు. స్వయం సమృద్ధి ని పెంచడమే మా ప్రభుత్వం లక్ష్యం. పారదర్శకతతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమం, క్లీన్ ఎనర్జీని పెంపొందించడం మా ఉద్దేశం. భారత దేశాన్ని ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ను రూపొందించడం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం మా లక్ష్యం. ఈ సాధనలో మైనింగ్ సెక్టార్ ముఖ్యమైన పాత్ర పోషించునుంది మైనింగ్ సెక్టార్ భాగస్వామ్యం తప్పనిసరి. బలమైన మైనింగ్, మినరల్స్ సెక్టార్ లేకుండా స్వయం సమృద్ధి సాధ్యం కాదని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఈ రెండూ మన ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో పాటే మినరల్స్ కు డిమాండ్ పెరుగుతున్నది. అందుకే ఆధునిక టెక్నాలజీతో ఖనిజ సంపదను అన్వేషించాల్సిన సమయం ఇది. దీని కోసం GSI ద్వారా ఎక్స్ టెన్సివ్ జియోలాజికల్ డేటా ను రూపొందించాం. ఎక్స్ ప్లోరేషన్ ను పెంచడానికి నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేశాం. మినరల్ ఎక్స్ ప్లోరేషన్ కోసం ప్రైవేట్ కంపెనీలను కూడా నోటిఫై చేశాము. GSI ద్వారా నేషనల్ జియో సైన్స్ డేటా డిపాజిటరీపై బేస్ లైన్ జియో సైన్ డేటాను అందుబాటులోకి తెచ్చాం. భవిష్యత్తులో సీస్మిక్ రిఫ్లెక్షన్స్, ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ప్రయోగం ద్వారా ఇంకా అడ్వాన్స్డ్ డేటా అందుబాటులోకి తెస్తాం.
మినరల్ ఎక్స్ ప్లోరేషన్ లో GSI కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రోజు హ్యాకథాన్ ఫై ఇన్నోవేటివ్ మినరల్ హంట్ టెక్నిక్ ను ప్రారంభించుకోవడం కోసం మనం ఇక్కడ సమావేశమయ్యాం. 2015కు ముందు మైనింగ్ సెక్టార్లో అనేక సవాళ్లు ఉండేవి. బ్లాక్స్ కేటాయింపు పై అనేక కోర్టు కేసులు నడిచేవి. రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన భాగస్వామ్యం లభించేది కాదు. తగిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల గ్రాంట్, రెన్యువల్స్ ఆగిపోయేవి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో 2015లో MMDR చట్టంలో పలు సవరణలు తెచ్చిన తర్వాతే మైనింగ్ సెక్టార్లో సంస్కరణలు మొదలయ్యాయి. ఆ సంస్కరణల లాభం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు 373కి పైగా మైనింగ్ బ్లాక్స్ వేలం పూర్తయింది. అయితే ఈ ప్రయాణంలో 2023లో 24 క్రిటికల్ అంద్ స్ట్రాటజికల్ బ్లాక్స్ ను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు క్రిటికల్ మినరల్ కు సంబంధించి రెండవ, మూడవ ట్రాంచ్ కు చెందిన బిడ్డర్స్ ను ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. వారికి నా అభినందనలు. బిడ్డర్లు త్వరగా ఉత్పత్తి మొదలు పెట్టలని కోరుకుంటున్నాను. ఇదే ఉత్సాహంతో 4వ ట్రాంచ్ బిడ్ కోసం నేటి రోడ్ షో చాలా కీలకం. భారత ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి స్టేక్ హోల్డర్స్ కు ఇది ఒక గొప్ప అవకాశం. అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ ఈ 6 రాష్ట్రాల్లో వేలం వేయడానికి 10 కొత్త క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ ను గనుల శాఖ ఎంపిక చేసింది. మినరల్ ప్రభావిత వర్గాల సంక్షేమం కోసం  కేంద్ర ప్రభుత్వం 2015లో 23 రాష్ట్రాల్లోని 645 జిల్లాల్లొ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ లు ఏర్పాటు చేసింది. మినరల్ రంగంలో ఇదో కీలక పరిణామం. మైనింగ్ ప్రభావిత వర్గాల సంక్షేమం విద్య, వైద్యం, స్కిల్ డెవలప్ మెంట్,వారి జీవనోపాధికి ఈ ఫండ్ కీలకంగా ఉంది. ఈ సందర్బంగా నేషనల్ DMF పొర్టల్ ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. ఖనిజ క్షేత్రంలో స్వయం సమృద్ధి సాధించడానికి మా ప్రభుత్వం కృత నిశ్చ్యమతో ఉంది మనమంతా సంఘటితంగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. మనందరం కలిసి గౌరవ ప్రధాన మంత్రి స్రీ నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్ కలను నిజం చేయడానికి కృషి చేద్దామని పిల్పునిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో….
విజయ్ కుమార్ సిన్హా, బీహార్ ఉపముఖ్యమంత్రి
వీణ కుమారి జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్
జనార్ధన్ ప్రసాద్ డైరెక్టర్ జనరల్ జిహలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
సుశీల్ కుమార్ DGM తెలంగాణ తదితరులు పాల్గొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This