ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ని కలిశారు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.సోమవారం హోంశాఖ కార్యాలయానికి వెళ్ళిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి నార్త్ బ్లాక్ లో బండిసంజయ్ ని కలిసి శుభకాంక్షలు తెలిపారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఇటీవలే కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచిన బండిసంజయ్ కి కేంద్రమంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే.మరోవైపు సోమవారం లోక్ సభ సభ్యుడిగా బండిసంజయ్ ప్రమాణస్వీకారం చేశారు.అచ్చమైన తెలుగు భాషలో అయిన ప్రమాణస్వీకారం చేశారు.