బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్ రాజ్యం తీసుకువచ్చే ప్రమాదం పొంచివుందని తెలిపారు.పశ్చిమ బెంగాల్,తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయి,కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాల పై తన వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి ఏంటో తెలియజేయాలని స్పష్టం చేశారు.లేదంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని తెలిపారు.