- రేవంత్ ను నమ్మి తెలంగాణ ఆగం అయింది
- పదేపదే మోసపోతే అది మన తప్పు అవుతుంది
- మంచి నాయకుని గెలిపిస్తేనే అభివృద్ది సాధ్యం
- ఎన్నిక ఏదైన బీజేపీ, కాంగ్రెస్‌లకు బుద్ది చెప్పాలి
- మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అంటూ వ్యాఖ్యానించారు. అదివారం నాడు మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డారని పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుందన్నారు. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు. వచ్చే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఒకే తప్పును మళ్లీ చేయొద్దని, జీహెచ్ ఎంసీతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రెవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారని, ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదన్నారు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే అని అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారని, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెప్పే సమయం వచ్చిందని, తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి’’ అని పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అయన పిలుపునిచ్చారు. ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని, ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండవ ఘనత సాధించిన పార్టీగా మన గర్వం అని కేటీఆర్ తెలిపారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించి కార్యకర్తలు కేటీఆర్ కు స్వాగతం పలికారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ ఎస్‌లో చేరడం జరిగింది.