- సీఎం రేవంత్ రెడ్డి
బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి-వేడిగా జరిగాయి.అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.సీఎం రేవంత్ రెడ్డి,కేటీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో కేటీఆర్ పై ఆగ్రహానికి గురైయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.మోసం అనే ప్రణాళికలు అమలు చేస్తున్నారని విమర్శించారు.పదేళ్లు ఏలిన బీఆర్ఎస్,పది నెలలు నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తుందని వ్యాఖ్యనించారు.బతుకమ్మ చీరాల కాంట్రాక్టు బినామీలకు ఇచ్చి కమిషన్లు తీసుకోని పేదలకు మోసం చేశారా లేదా అని ప్రశ్నించారు.