నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(M K Stalin) చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సమర్థించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను పరిగణనలోకి తీసుకోకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగానే నియోజకవర్గాల పునర్విభన చేయాలని భావిస్తే.. అది దేశానికి అందించే ఆర్థిక సహకారం వాటా ఆధారంగా ఉండాలని ప్రతిపాదించారు. దేశ నిర్మాణానికి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ జనాభా కేవలం 2.8 శాతం మాత్రమే ఉందని.. కానీ దేశ జీడీపీలో మాత్రం 5.2 శాతం కంటే ఎక్కువ వాటా అందిస్తోందని పేర్కొన్నారు.