అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము ఏర్పాటు చేసిన పునాదుల పై తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను..జై తెలంగాణ “అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు.