- పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు
- ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
- అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు విషయంలో ఎస్సై లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుతో సోదాలు నిర్వహించిన అధికారులకు ఎస్సై షఫీ రూ . 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పట్టుబడినవారిలో ఇన్‌స్పెక్టర్ వీరాస్వామి, కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు సమాచారం.ఇలా ఎక్కడో చోట ఖాకిలే అవినీతి , అక్రమాలకు పాల్పడితే ఇక ఇలాంటి అధికారులు ప్రజలకు ఎం భరోసా ఇస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి అధికారుల అక్రమాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.