Friday, September 20, 2024
spot_img

బ్రిటన్ లో అధికారం లేబర్ పార్టీ దె?

Must Read

( ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం )

  • బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాల్లో జరగబోతున్న ఎన్నికల పై జోశ్యం
  • రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపలేరు
  • భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలే
  • కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం లేదు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంతమంది నాయకుల నుండి పదవి గండం

గత కొద్దీ కాలంగా గమనించినట్లయితే ప్రముఖ మహా ఉగ్ర కాళీకా దేవి ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ తన ఉపాసనా శక్తీ ద్వారా చెప్పిన పలు జోష్యాలు అక్షర సత్యాలుగా మారుతున్నాయి.తాజాగా బ్రిటన్ లో 650 పార్లమెంట్ స్థానాలలో జరగబోతున్న ఎన్నికల పై ప్రముఖ దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం చెప్పారు.ఈ ఎన్నికలలో రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ,కెయిర్స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్న “సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ” లతో పాటుగా “లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ”, “స్కాటిష్ నేషనల్ పార్టీ”, “రిఫార్మ్ యుకె” వంటి మరికొన్ని పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం సెంటర్ రైట్ కన్జర్వేటివ్ పార్టీ మరియు కెయిర్స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ ల మధ్యనే ఉండబోతుందని స్పష్టం చేశారు.2010 నుండి అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ తరపున మొట్టమొదటి ఏషియన్ సంతతి ప్రధానిగా వ్యవహరిస్తున్న రిషి సునాక్ ఈ ఎన్నికలలో తన ప్రభావం ఏమాత్రం చూపించలేరని తెలిపారు.కెయిర్స్టార్మెర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్ లెఫ్ట్ లేబర్ పార్టీ మరోసారి తన సత్తా చాటడం ద్వారా 2019 లో పొందిన ఘోర పరాజయానికి బదులు తీర్చుకుంటుందని అన్నారు.ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించడం ద్వారా అధికారాన్ని పొందుతుందని,అలాగే ౩వ స్థానం కోసం లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ,స్కాటిష్ నేషనల్ పార్టీ,రిఫార్మ్ యుకె పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ లిబరల్ డెమ్పోక్రాట్స్ పార్టీ మాత్రమే ఆ స్థానాన్ని సొంతం చేసుకోగలదని ఈ సందర్భంగా ప్రముఖ మాహా ఉగ్ర కాళికా దేవి ఉపాసకులు పవన్ కుమార్ శర్మ జోశ్యం చెప్పారు

తెలుగు రాష్ట్రాల రాజకీయాల పై జోశ్యం చెబుతూ,39 అసెంబ్లీ స్థానాలను సాధించిన బీఆర్ఎస్ పార్టీ నుండి 06 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లో చేరారని,భవిష్యత్తులో ఆ పార్టీలో కేవలం 04 లేదా 05 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని తెలిపారు.అధినేత కేసీఆర్ తన ప్రాభవం కోల్పోతున్నప్పటికీ జైలు యోగం మాత్రం ప్రస్తుతానికి లేదని జోశ్యం చెప్పారు.కానీ కేటీఆర్ కి మాత్రం పలు కేసులతో సమస్యలు తప్పవని జైలు యోగ సూచనలు కూడా ఉన్నాయని వెల్లడించారు.అయితే కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం ద్వారా సమస్యలను అధిగమించే అవకాశం ఉందని పవన్ కుమార్ శర్మ జోశ్యం చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకుల నుండి పదవీగండ సూచనలున్నప్పటికి రానున్న 02 సంవత్సరాలలో తన పదవికి ఎలాంటి ఢోకా లేదని వెల్లడించారు.కానీ తూర్పు తెలంగాణాకి చెందిన కొందరు నాయకుల వలన తలనొప్పులు ఉండే అవకాశం ఉందని అన్నారు.సీఎంఓ ఆఫీసులో ఆగ్నేయ బాగాన ఉన్న కొన్ని వాస్తు దోషాలను సరిచేసుకోవడం ద్వారా పాలనలో ఉన్న అవంతరాలు తొలిగిపోతాయని తెలిపారు.

ఈ మధ్యనే విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కూటమి పార్టీలపై కొన్ని ప్రత్యేక అంశాలను ప్రజల్లో రేకెత్తించడం ద్వారా ఒత్తిడి పెంచి ముచ్చెమటలు పట్టించడంలో జగన్మోహన్ రెడ్డి సఫలీకృతుడు అవుతాడని వెల్లడించారు.కొంతమంది భావిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం జైలుకెల్లే యోగమేమి లేదని చెప్పారు.అలాగే టిడిపి సెంట్రల్ పార్టీ ఆఫీస్ పై గతంలో జరిగిన దాడిలో పాల్గొన్న నేరస్థులను గుర్తించే క్రమంలో అధికార పార్టీ వైఖరి కొండను త్రవ్వి ఉడత కోసం వేదికిన చందంగా ఉంటుందని చెప్పారు. వైసిపీ నాయకుడు ఆరవ సత్యం కి జైలు యోగం ఉందని,అయితే వివిధ మాధ్యమాలలో వస్తున్నట్లుగా దేవినేని అవినాష్ కి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ జోశ్యం చెప్పారు.

2024 జులై 13 దాటిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు ఊహించని ఉపద్రవాలు ప్రళయం ముంచుకొస్తుందా అన్నట్లుగా పరిస్థితులు మారుతాయి అని తెలిపారు.కొన్ని దేశాల్లో యుద్దవాతావరణం నెలకొనడమే కాకుండా ఆ దేశాల మధ్య కొన్ని నెలల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.యూరప్ దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరతాయని,అమెరికా తో పాటు యూరప్,పశ్చిమాసిలలో ఆర్ధిక సంక్షోభం పెరుగుతుందని వెల్లడించారు. ఒక అతి పెద్ద దేశం బయో ఆయుధాల తయారీ మరోసారి మొదలు పెట్టె అవకాశం ఉందని అన్నారు.పలు పకృతి వైపరీత్యాలు అనగా సైక్లోన్స్,భారీ తుఫానులు,వరదలు,టోర్నడోలు సంభవించడం వలన లక్షల మంది నిరాశ్రయులౌతారని,మరెన్నో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని తెలిపారు.పెద్ద పెద్ద కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన చెప్పే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.అంతె కాకుండా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సునామి, 4 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనాల తాలూకు వంటి చేదు సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు.కావున ప్రజలందరు ముందు జాగ్రత్త వహిస్తూ ఉండాలని మహా ఉగ్ర కాళికా దేవి ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ తన ఉపాసన శక్తీ తో భవిష్యవాణి చెప్పారు.

ఈ మధ్యనే వీరు అమెరికా ఎన్నికల ఫలితాల గురించి భవిష్యవాణి చెబుతూ అమెరికా పీఠం ట్రంప్ దె అని అని చెప్పిన జోశ్యం మన ఆదాబ్ హైదరాబాద్ పాఠకులకు విదితమే.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This