Friday, September 20, 2024
spot_img

గ్రూప్ 02 అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మరో అవకాశం

Must Read

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్2 సర్వీసుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తూ చేసుకున్న అభ్యర్థులకు టీపీఎస్సి ముఖ్యమైన సూచనలు జారీచేసింది.అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫాంలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.ఎడిట్ చేసుకునేందుకు జూన్ 16 ఉదయం 10 గంటల నుండి జూన్ 20వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అధికార వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచామని,ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు.అభ్యర్థులు వెబ్ సైట్ లో తమ వివరాలను ఎంటర్‌ చేసి ఆన్‌లైన్‌ లో అప్లికేషన్‌ ఓపెన్‌ చేసుకోవచ్చు. తాము చేసిన ప్రతి ఎంట్రీని సరిచూసుకోవాలని,అవసరమైన చోట కరెక్షన్స్ చేసుకోవాలని తెలిపారు. జూన్ 16 నుండి జూన్ 20 వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ద్వారా అభ్యర్ధులు తమ వివరాలను సరిచేసుకోవాలని,తర్వాత అప్లికేషన్‌ను సవరించడానికి అవకాశం ఉండదు అని టీజీపీఎస్సీ స్పస్టం చేసింది.అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకున్న తర్వాత పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This