ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లతో మాట్లాడి ప్రతి జిల్లాలోని 100 పడకల ఆసుప్రతిలలో బ్లడ్ బ్యాంక్ ఏర్పడేలా కృషి చేస్తానని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.20వ బ్లడ్ డోనర్స్ డే సంధర్బంగా రాజ్ భవన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.బ్లడ్ డోనెట్ చేసిన దాతలతో ముచ్చటించి,వారికి మేమోలు అందజేశారు.ఈ సంధర్బంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
రక్త దానం గొప్ప కార్యక్రమమని,శరీరం నుండి రక్తదానం ఇవ్వడం గొప్ప దార్శనికత అని అన్నారు.రక్త దానం చేస్తే ఏదో జరుగుతుందనే అపోహను వీడాలని కోరారు.3 నెలలకు ఒకసారి రక్తదానం ఇవ్వచ్చు అని తెలిపారు.ఒక్కొక్కరు 50 నుండి 60 సార్లు రక్త దానం చేయడం గొప్ప నిర్ణయమని వారికి మరింత మంచి జరుగుతుందని ఆకాంక్షించారు.తాను కూడా విద్యార్థి దశ లో ఉన్నప్పటి నుండి ప్రత్యేకమైన రోజుల్లో రక్తదానం చేసేదని గుర్తుచేసుకున్నారు.100 బెడ్స్ ఉన్న ప్రతి హాస్పిటల్ కి ఒక బ్లడ్ బ్యాంక్ ఉండేలా చూస్తే ఇబ్బందులు ఉండవని,రెడ్ క్రాస్ వాహనాలకు రవాణా శాఖ తరుపున వారికి పన్నుల మినహాయింపు అనేదాని పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.తలసేమియా వ్యాధి ఉన్నవారు బస్ పాస్ అడుగుతున్నారు వారు చేస్తున్న డిమాండ్ పై చర్చిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఎఎస్,రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం,హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్తూ,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ఆర్వీ కర్ణన్,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సీఈఓ మధన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు
.
Must Read