Saturday, April 19, 2025
spot_img

బీసీ రిజర్వేషన్‌ 42శాతం పెంచిన తరువాత స్థానిక ఎన్నికలు

Must Read
  • హెచ్చ‌రించిన రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్‌ 42 శాతం పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ వ్యతిరేక చర్యలను ఇప్పటికైనా మానుకోవాలని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం కాచిగూడ అభినందన గ్రాండ్‌ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం మేడ్చల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీరామ్‌ జ్ఞానేశ్వర్‌కు ఆయన నియామక పత్రం అందజేసి మాట్లాడారు. కుల గణన పూర్తయినప్పటికీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌, ఎంపీటీస్‌, జడ్పీటీసీ లలో బీసీలకు 20 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని 42 శాతం పెంచితేనే బీసీలు రాజ కీయంగా అభివృద్ధి సాధిస్తారని అన్నారు. విద్య, ఉద్యోగ రంగాలలో కూడా బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీలలోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క దానికి వెయ్యి కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేష్‌బీ వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజి, నంద గోపాల్‌, మట్ట జయంతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS